Akshardham: అద్భుతం.. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ఎంపీలు..

భారతదేశ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం జూన్ 1న న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా.. విక్టోరియా ఎంపీలు లీ టార్లామిస్, పౌలిన్ రిచర్డ్స్, బెలిండా విల్సన్, షీనా వాట్, జూలియానా అడిసన్ న్యూ ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.

Akshardham: అద్భుతం.. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ఎంపీలు..
Australia Mps

Updated on: Jul 06, 2025 | 9:23 AM

దేశ రాజధాని ఢిల్లీలోని స్వామినారాయణ అక్షరధామ్ ఆలయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా.. ఆస్ట్రేలియా ఎంపీలు స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్షరధామ్ మందిరం నిర్మాణం – అద్భుతమైన కట్టడం చూసి మంత్రముగ్ధులయ్యారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన పార్లమెంటు సభ్యుల ప్రతినిధి బృందం జూన్ 1న న్యూఢిల్లీకి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా.. విక్టోరియా ఎంపీలు లీ టార్లామిస్, పౌలిన్ రిచర్డ్స్, బెలిండా విల్సన్, షీనా వాట్, జూలియానా అడిసన్ న్యూ ఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఎంపీలను ఆలయ ప్రతినిధులు సాంప్రదాయకంగా స్వాగతం పలికారు.. అనంతరం మందిరంలో ప్రత్యేక పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. సంక్లిష్టమైన నిర్మాణాన్ని చూసి వారంతా ఆశ్చర్యపోవడంతోపాటు.. మంత్రముగ్ధులయ్యామంటూ కితాబిచ్చారు.

ఈ సందర్భంగా శ్రీ నీలకాంత్ వర్ణికి అభిషేకం చేశారు.. హాల్ ఆఫ్ వాల్యూస్‌లో భారతీయ సంస్కృతి, స్ఫూర్తిదాయకమైన సందేశాలను చూసి భక్తి పారవశ్యంలో మునిగితేలారు.. అలాగే.. సాంస్కృతిక పడవ ప్రయాణం చేశారు. అక్షరధామ్ మందిర్ అద్భుతం అంటూ కొనియాడారు.

అక్షరధామ్ శాంతి, సామరస్యం, సేవ సందేశానికి ప్రతినిధి బృందం హృదయపూర్వక ప్రశంసలను వ్యక్తం చేసింది. వారి సందర్శన భారతదేశం – ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న బంధాలను, పరస్పర గౌరవం, భాగస్వామ్య విలువలతో శతాబ్దాలుగా పాతుకుపోయిన విషయాలను హైలైట్ చేసింది.

జూలియానా, అడిసన్ ఎంపీ.. అతిథి పుస్తకంలో ఏం రాశారంటే..

“ఈ అత్యంత పవిత్ర స్థలాలను సందర్శించడం ఒక అద్భుతమైన గౌరవం .. గొప్ప అవకాశం. ఇక్కడ నా సందర్శన క్లుప్తంగా మాత్రమే ఉంది; అయితే, నేను నేర్చుకున్న బోధన, నేను ఎప్పటికీ నాతో తీసుకెళ్లగలను. మీ స్వాగతానికి.. దేవుని గురించి నా అవగాహనను పెంపొందించుకోవడానికి నన్ను అనుమతించినందుకు ధన్యవాదాలు.” అంటూ పేర్కొన్నారు.

ఈ సందర్శనలో ఆస్ట్రేలియా – భారతదేశం మధ్య స్నేహం, సాంస్కృతిక అవగాహన బంధాలను బలోపేతం చేసినందుకు కృతజ్ఞులం.. అంటూ ఎంపీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..