Auction Of PM Mementos: ప్రధానమంత్రి బహుమతుల ఈ-వేలం గడువు పొడిగింపు.. బిడ్ లో ఎన్నో చారిత్రాత్మక వస్తువులు..

బహుమతుల ప్రదర్శనను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో నిర్వహిస్తుండగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. అక్టోబర్ 12 వరకు..

Auction Of PM Mementos: ప్రధానమంత్రి బహుమతుల ఈ-వేలం గడువు పొడిగింపు.. బిడ్ లో ఎన్నో చారిత్రాత్మక వస్తువులు..
PM Narendra Modi Received Replica of Kedarnath Temple (File Photo)

Updated on: Oct 08, 2022 | 7:55 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆయనకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన, చిరస్మరణీయమైన బహుమతుల నాలుగో ఎడిషన్ ఈ-వేలాన్ని ప్రారంభించింది. తొలుత అక్టోబర్ రెండు వరకు ఈ-వేలానికి గడువు విధించగా, తాజాగా మరో పది రోజుల గడువు పొడిగించారు. దీంతో అక్టోబర్ 12 (బుధవారం) వరకు ఈ-వేలం కొనసాగనుంది. బహుమతుల ప్రదర్శనను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో నిర్వహిస్తుండగా.. వాటిని అందరూ ఉచితంగా చూడవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఈ-వేలం ద్వారా సేకరించిన నిధులను గంగ నదిని పరిరక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి దోహదం చేస్తున్న ‘నమామి గంగే’ ప్రాజెక్ట్‌కు వినియోగించనున్నారు. తన బహుమతుల వేలం గడువును పొడిగించామని, వేలంలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వచ్చిన బహుమతల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయానికి సంబంధించిన ప్రతిరూపాన్ని వేలంలో ఉందని, బిడ్ లో పాల్గొనడం ద్వారా దీనిని సొంతం చేసుకునే అవకాశం ఉందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పేర్కొంది. ఈ ట్వీట్ ను జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంవత్సరాలుగా తనకు లభించిన అనేక ప్రత్యేక బహుమతుల్లో ఇది ఒకటని, ప్రజల విజ్ఞప్తి మేరకు బహుమతుల ఈ-వేలం అక్టోబర్ 12వ తేదీ వరకు పొడిగించబడిందని, పాల్గొనాలంటూ కోరారు.

బహుమతుల ప్రదర్శనను ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో నిర్వహిస్తుండగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. అక్టోబర్ 12 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతుల ఈ-వేలాన్ని ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి తన పర్యటనల సమయంలోనూ, అలాగే ప్రధానమంత్రి కార్యాలయానికి దేశం నలుమూలల నుండి ప్రముఖ వ్యక్తులు, శ్రేయాభిలాషుల నుంచి వచ్చిన అనేక జ్ఞాపికలను ఈ- వేలంలో అందుబాటులో ఉంచారు. వీటిలో చారిత్రాత్మకమైన బహుమతులు ఎన్నో ఉన్నాయి. పెయింటింగ్ లు, శిల్పాలు, హస్తకలు, జానపద కళాఖండాలు ఇలా ఎన్నో రకాల వస్తువులు ఈ-వేలంలో ఉంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..