యాంటీ ట్యాంక్ మిసైల్ ‘ధ్రువాస్త్ర’ ప్రయోగాలు విజయవంతం

ఒడిషాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణి 'ధ్రువాస్త్ర' ప్రయోగాలు మూడూ విజయవంతమయ్యాయి. భారత పరిశోధన, అభివృద్ది  సంస్థ  (డీ ఆర్ డీ ఏ) రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ పై నుంచి..

యాంటీ ట్యాంక్ మిసైల్ ధ్రువాస్త్ర ప్రయోగాలు విజయవంతం

Edited By:

Updated on: Jul 23, 2020 | 11:04 AM

ఒడిషాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ట్యాంక్ విధ్వంసక క్షిపణి ‘ధ్రువాస్త్ర’ ప్రయోగాలు మూడూ విజయవంతమయ్యాయి. భారత పరిశోధన, అభివృద్ది  సంస్థ  (డీ ఆర్ డీ ఏ) రూపొందించిన ఈ మిసైళ్లను హెలికాఫ్టర్ పై నుంచి ప్రయోగించవచ్చు.. ప్రపంచంలోని ఈ  తరహా క్షిపణుల్లో ఇది అత్యంత ఆధునికమైనదని డీ ఆర్ డీ ఏ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15, 16 తేదీలలోను, తాజాగా 22 న మరో మిసైల్ ని ప్రయోగించారు. ఆకాశం నుంచే కింది శత్రు బంపర్లను నాశనం చేయగల ధ్రువాస్త్ర మిసైళ్ళు మన సైన్యానికి ఎంతో ప్రయోజనకరమని అంటున్నారు.

భారత-చైనా ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో ఈ క్షిపణుల పాత్ర చాలా కీలకమైనది.