అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై నడ్డా క్లారిటీ.. ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న బీజేపీ అధ్యక్షుడు

|

Jan 31, 2021 | 5:55 AM

దక్షిణాదిలో విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం అందుకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఆవకాశంగా మల్చుకోవాలని..

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తుపై నడ్డా క్లారిటీ.. ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామన్న బీజేపీ అధ్యక్షుడు
Follow us on

దక్షిణాదిలో విస్తరణపై దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం అందుకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఆవకాశంగా మల్చుకోవాలని భావిస్తుంది. త్వరలో జరగబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్థానిక ప్రాంతీయ పార్టీలతో జతకట్టి సత్తా చాటేందుకు పావులు కదుపుతుంది.

ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకేతో పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మధురైలో జరిగిన సభలో క్లారిటీ ఇచ్చారు. ఇరు పార్టీల‌ మధ్య ఉన్న‌ పొత్తు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని నడ్డా చెప్పారు. అయితే తమ కూటమి నుంచి ముఖ్య‌మంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు.

సీఎం అభ్యర్థి విషయంలో అసెంబ్లీ ఎన్నికల అనంత‌రం పరిస్థితుల‌ను బట్టి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నేత‌లు అంటున్నారు. మధురైలో జరిగిన సభలో పాల్లొనే ముందు జేపీ న‌డ్డా మీనాక్షి దేవాలయాన్ని సందర్శించి, పూజ‌ల్లో పాల్గొన్నారు. అనంత‌రం పార్టీ కోర్ కమిటీ సమావేశంలో నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు.