కోరిక తీర్చలేదని హత్య.. అంకితా భండారి కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష!

ఉత్తరాఖండ్‌లోని హోటల్ రిసెప్షనిస్ట్ అంకిత భండారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యతో పాటు ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది. 2022 సెప్టెంబరులో జరిగిన ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కోర్టు తీర్పుతో బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందని భావిస్తున్నారు.

కోరిక తీర్చలేదని హత్య.. అంకితా భండారి కేసులో ముగ్గురికి యావజ్జీవ శిక్ష!
Ankita Bhandari

Updated on: May 30, 2025 | 4:40 PM

ఎట్టకేలకు న్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంకితా భండారి కేసులో ముగ్గురు నిందితులకు ఉత్తరాఖండ్‌ స్థానిక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2022లో ఉత్తరాఖండ్ లో సంచలనం రేపిన హోటల్ రిషెప్సనిస్ట్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది ఉత్తరాఖండ్ కోర్టు. ఈ కేసులో బీజేపీ మాజీ నేత కొడుకు పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరు సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తాలను దోషులుగా నిర్ధారించింది కోర్టు.

పౌరి జిల్లాలోని యమకేశ్వర్ ప్రాంతంలో రిసార్ట్‌లో పనిచేస్తున్న అంకితను లైంగిక వాంఛ తీర్చలేదని ఆమె పని చేసే రిసార్ట్‌ ఓనరే ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఉత్తరాఖండ్‌ స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. అంకిత భండారి సెప్టెంబర్ 18, 2022న కనిపించకుండా పోయినట్లు కేసు నమోదయ్యింది. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, మరొక ఉద్యోగి అంకిత్ అలియాస్ పుల్కిత్ గుప్తాతో కలిసి రిషికేశ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. రిషికేష్ నుండి తిరిగి వచ్చే సమయంలో నలుగురు చిలా రోడ్డులో ఉన్న ఒక కాలువ దగ్గర ఆగినట్లు తెలుస్తోంది.

అక్కడ నిందితులు ముగ్గురు మద్యం సేవించి, అంకితను లైంగికంగా వేధించగా అంకిత తిరస్కరించడంతో ఆగ్రహించిన ముగ్గురు నిందితులు ఆమెను కాలువలోకి తోసేసి చంపేశారు. ఈ సంఘటన అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు దర్యాప్తులో వైఫల్యం, రాజకీయ ఒత్తిడి కారణంగా కేసు పక్కదోవ పట్టిస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 97 సాక్షులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్ బృందం.. వీరిలో 47 మంది పేర్లను మార్చి 28, 2023న తొలగించారు. పుల్కిత్ ఆర్య, మరో ఇద్దరు నిందితులకు ఉత్తరాఖండ్‌ స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..