Anant Ambani: ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచ్ ధరించిన అనంత్ అంబానీ.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా ?..

|

Mar 05, 2024 | 5:10 PM

గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు హాజరయ్యారు. బాలీవుడ్ సినీ సెలబ్రెటీస్ స్పెషల్ ఫర్ఫామెన్స్ ఇచ్చారు. బాలీవుడ్ తారలతోపాటు.. సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెళ్లారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో సహా ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి మార్చి 3 వరకు జరిగిన ఈవేడుకల ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సెలబ్రెషన్లలో బిల్ గేట్స్, ఇవానా ట్రంప్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్

Anant Ambani: ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచ్ ధరించిన అనంత్ అంబానీ.. దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసా ?..
Ananth Ambani
Follow us on

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రెషన్స్ వీడియోస్, ఫోటోస్ కనిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపన్నులు హాజరయ్యారు. బాలీవుడ్ సినీ సెలబ్రెటీస్ స్పెషల్ ఫర్ఫామెన్స్ ఇచ్చారు. బాలీవుడ్ తారలతోపాటు.. సౌత్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెళ్లారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో సహా ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో పాల్గొన్న సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి మార్చి 3 వరకు జరిగిన ఈవేడుకల ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సెలబ్రెషన్లలో బిల్ గేట్స్, ఇవానా ట్రంప్, మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన సతీమణితో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.

ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలో అందరి దృష్టిని ఆకర్షించింది అనంత్ అంబానీ ధరించిన వాచ్. దాని విలువ అక్షరాల రూ. 63 కోట్లు. ఈ వాచ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన 10 మోడళ్స్ గడియారాలలో ఒకటైన ‘రిచర్డ్ మిల్లే RM 56-02’ బ్రాండ్. అంబానీ ధరించిన వాచ్ చూసి మెటా సీఈవో జుకర్ బర్గ్ సతీమణి ప్రిసిల్లా చాన్ ఆశ్చర్యపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అనంత్ ధరించిన ఈ ఖరీదైన వాచ్ RM 56-02 క్రిస్టలైన కలెక్షన్. అలాగే ఆ వాచ్ బేస్ ప్లేట్ గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేస్తారు. 0.35 మిమీ మందం కలిగిన టైటానియం సింగిల్ చట్రంతోపాటు.. సెరమిక్స్ కేబుల్ ఉపయోగించి కేస్ లోపల సస్పెండ్ చేయబడింది. RM 56-02 గురుత్వాకర్షణ ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా సమయపాలన ఖచ్చితత్వాన్ని పెంపొందించే టూర్ బిల్లన్ ఎస్కేప్‌మెంట్‌ను కలిగి ఉంది. ఈ ఖరీదైన వాచ్ $2.2 మిలియన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రూ. 18.2 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.

రిచర్డ్ మిల్లే గడియారాలు ఎందుకు అంత ఖరీదైనవి ?..

అంబానీ ధరించిన RM 56-02 రిచర్డ్ మిల్లే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. ఇందులో ఒక నీలమణి కేస్ తయారు చేయడానికి కనీసం 40 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత దాదాపు 400 గంటలపాటు మ్యాచింగ్, ఫినిషింగ్ వ్వేర్వేరు పనులు చేస్తారు. ఈ వాచ్ తయారు కోసం వజ్రాలను ఉపయోగిస్తారు. రిచర్ట్ మిల్లే సంతకం ఉంటుంది. ఈ వాచ్ తయారు ఎంతో శ్రమతో.. సవాలుతో కూడుకున్నది. ఏరోనాటికల్ పరిశ్రమ , ఫార్ములా వన్ ప్రపంచం కోసం ఎక్కువగా రిజర్వ్ చేయబడిన బేస్‌ప్లేట్ మెటీరియల్‌ ఉపయోగిస్తారు. ప్లాటినం, బంగారం వంటి అధిక-గ్రేడ్ మెటీరియల్‌లతో వీటిని రూపొందిస్తారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.