Anand Mahindra: వర్షంలో చిన్నోడి ఆటలు.. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..

Anand Mahindra: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఆనంద్ తరచూ ఆసక్తికరమైన వీడియోలను, ఫోటోలను షేర్..

Anand Mahindra: వర్షంలో చిన్నోడి ఆటలు.. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..
Anand Mahindra And His Post Visuals

Updated on: Jun 27, 2023 | 7:08 PM

Anand Mahindra: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఆనంద్ తరచూ ఆసక్తికరమైన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో మహారాష్ట్రంలో వర్షం పడుతున్న సందర్భంగా సదరు బిజినెస్ మ్యాన్ ఓ చిన్నోడి వీడియోను షేర్ చేశారు. వర్షంలో ఆ చిన్నోడి ఆటకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఆనంద్ మహీంద్రా మంగళవారం ఉదయాన్నే తన ట్విట్టర్ ఖాతా నుంచి ఆ వైలర్ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ చిన్నోడు వర్షం పడుతుండడంతో దాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా నేలపై పడుకుండిపోయాడు. ఆ వీడియోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేస్తూ, ‘ఎట్టకేలకు వచ్చిన రుతుపవనాలను చూడడానికి ముంబైలోని ఇంటికి వళ్లిప్పుడు ఎలా అనిపిస్తుందో దాని సారాంశం ఇది… (ప్రతి భారతీయుడిలోని చంటిపిల్లాడు మొదటి జల్లులలోని ఆనందాన్ని పొందేందుకు ఎప్పటికీ అలసిపోడు)’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, దీనిపై నెటిజన్లు ఆకర్షితులై రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘ఎండాకాలంలో వర్షం, భారతీయులు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు’..‘సార్ మీరు వర్షంలో తడుస్తున్న వీడియోను షేర్ చేయండి, మేము కూడా అనుసరిస్తాము’.. ముంబైలోని వర్షాలు నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కాదు’.. ‘నేను కూడా ముంబైలో ఉన్నాను. ఆ రోజులు చాలా అద్భుతమైనవి’ అంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటి వరకు 4 లక్షల 56 వేల ఇప్రెషన్స్, 13 వేల లైకులు లభించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..