మహారాష్ట్రలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, తిరిగి లాక్ డౌన్ తప్పదేమోనంటున్న ముంబై మేయర్

మహారాష్ట్రలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని ముంబై మేయర్కిశోరీ పెడ్నేకర్ తెలిపారు.

మహారాష్ట్రలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, తిరిగి లాక్ డౌన్ తప్పదేమోనంటున్న ముంబై మేయర్

Edited By: Anil kumar poka

Updated on: Feb 16, 2021 | 7:56 PM

మహారాష్ట్రలో మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తిరిగి లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని ముంబై మేయర్కిశోరీ పెడ్నేకర్ తెలిపారు. అయితే ఇది ప్రజలపైనే ఆధార పది ఉందన్నారు. ముఖ్యంగా రైలు ప్రయాణికులు చాలామంది మాస్కులు ధరించడం లేదన్నారు. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని పక్షంలో తిరిగి లాక్ డౌన్ విధించినా విధించవచ్చు అన్నారు.  ముంబైలో గత ఆదివారం 645, సోమవారం 493 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం సంఖ్య 3,14,569 కి చేరింది. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 11,420 కి చేరింది. కాగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కఠిన చర్యలు  తీసుకోవలసి రావచ్ఛునని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంతకుముందే హెచ్ఛరించింది. సాక్షాత్తూ ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఆ మధ్య కరోనా వైరస్ కేసులు చాలావరకు తగ్గిపోయాయి. కానీ ప్రజల నిర్లక్ష్యం కారణంగా  మళ్ళీ ఈ కేసులు పెరుగుతున్నాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :

Snake cross Road Video : రోడ్ క్రాస్ చేసిన భారీ పాము..అరగంట నిలిచిన ట్రాఫిక్..వైరల్ అవుతున్న వీడియో

Jabardasth Hyper Aadi Marraige Soon Video: హైపర్ ఆదికి ముక్కుతాడు వేసే పెళ్లాం వస్తోంది..అమ్మాయి ఎవరో తెలుసా..!