Air India Flight Crash: ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 5 మంది మెడికోలు మృతి..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787.. వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది.

Air India Flight Crash: ఆసుపత్రిలోని హాస్టల్‌పై కూలిన విమానం.. 5 మంది మెడికోలు మృతి..?
Air India Flight Crash

Updated on: Jun 12, 2025 | 4:59 PM

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలా మంది మరణించారు.. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787.. వెంటనే జనావాసాలపై కుప్ప కూలిపోయింది. అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే.. ఎయిర్ ఇండియా విమానం BJ మెడికల్‌ కాలేజ్‌ భవనంపై కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో కాలేజ్ భవనంతోపాటు.. మరో ఇతర భవనంలో కూడా మంటలు చెలరేగాయి.. ఈ ఘటనలో 5 మంది మెడికోలు చనిపోయినట్టు సమాచారం.. దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.

హాస్పిటల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై విమానం కూలిందని.. రెండు భారీ భవనాల్లో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. విమానం కూలడంతో భవనాలు నేలమట్టమయ్యాయి.

కాగా.. ఎయిర్ ఎండియా విమానంలో 242 మంది ఉన్నారు. 230 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి 1.38PMకి లండన్ కు బయలుదేరిన AI171 విమానం వెంటనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. బోయింగ్ 787-8 విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us