Cockpit fight: కాక్‌పిట్‌లో కొట్టుకున్న పైలట్లు సస్పెండ్.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన షాకింగ్‌ నిజాలు..!

|

Aug 29, 2022 | 6:49 PM

బీఈఏ కూడా ఎయిర్‌ ఫ్రాన్స్‌ పైలట్ల తీరును తప్పుపట్టింది. భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన మరిన్ని సంఘటనలతో కూడిన నివేదికను విడుదల చేసింది.

Cockpit fight: కాక్‌పిట్‌లో కొట్టుకున్న పైలట్లు సస్పెండ్.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన షాకింగ్‌ నిజాలు..!
Fight In Cockpit
Follow us on

Cockpit fight: కాక్‌పిట్‌లో గొడవకు దిగిన ఇద్దరు ఎయిర్ ఫ్రాన్స్ పైలట్లను సస్పెండ్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దాదాపు మూడు నెలల క్రితం జరిగినట్టుగా తెలిసింది. అంటే దాదాపు జూన్‌లో జరిగినట్టుగా సమాచారం. పైలెట్లు ఇద్దరు కాక్‌పిట్‌లోనే తీవ్రంగా కొట్టుకున్నారు. ఆ సమయంలో జెనీవా నుంచి పారిస్‌కు విమానం వెళ్తోంది. ఈ విషయాన్ని ఎయిర్ ఫ్రాన్స్ అధికారికంగా వెల్లడించింది. పైలట్ల గొడవ వల్ల విమానంపై ఎలాంటి ప్రభావం పడలేదని, సురక్షితంగా ల్యాండింగ్ అయ్యిందని చెప్పారు. ప్రయాణికుల భద్రతకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

స్విట్జర్లాండ్ లా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం,..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్, కో-పైలట్ గొడవ పడటం మొదలుపెట్టారు.. ఇద్దరూ ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. క్యాబిన్ సిబ్బంది రక్షించాల్సి వచ్చింది..కాక్‌పిట్‌లో పైలట్‌తో పాటు ఒక సిబ్బంది కూడా ఉన్నారు. అయితే, తాజాగా అప్పుడు గొడవ పడిన ఇద్దరు ఎయిర్ ఫ్రాన్స్ పైలట్లను సస్పెండ్ చేసినట్లు ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు. మరోవైపు ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, బ్యూరో డి ఎన్‌క్యూటెస్ ఎట్ డి ఎనాలిసెస్ (బీఈఏ) కూడా ఎయిర్‌ ఫ్రాన్స్‌ పైలట్ల తీరును తప్పుపట్టింది. భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్‌ ఫ్రాన్స్‌లో ఇటీవల జరిగిన మరిన్ని సంఘటనలతో కూడిన నివేదికను గత వారం విడుదల చేసింది.

2020 డిసెంబర్‌లో జరిగిన మరో సంఘటనపై నివేదికలో చాలా విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో కూడా ఎయిర్ ఫ్రాన్స్ విమానంలో పైలట్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో విమానం చాద్ మీదుగా వెళుతోంది. ఈ సమయంలో విమానం ట్యాంక్‌లో 1.4 టన్నుల ఇంధనం మాయమైనట్లు గుర్తించారు. సిబ్బంది భద్రతా విధానాలను పాటించలేదని, దీంతో అగ్ని ప్రమాదాలు పెరిగాయని నివేదిక తేల్చింది. చాద్‌లో విమానం సరిగ్గా ల్యాండ్ అయినప్పటికీ. 2017, 2022 మధ్య, పైలట్‌లు భద్రతా ప్రోటోకాల్‌లను ఉపయోగించకుండా వారి స్వంత మార్గంలో పరిస్థితిని సమీక్షించినప్పుడు ఇలాంటి మూడు కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి