Manipur Violence: మణిపుర్‌లో మరోసారి మారణకాండ.. కాల్పులకు పాల్పడిన దుండగులు.. స్థానికుల ఆగ్రహం..

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి భగ్గుమంది. తోబల్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం మణిపూర్‌లోని తోబల్‌ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. అనేకమందికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Manipur Violence: మణిపుర్‌లో మరోసారి మారణకాండ.. కాల్పులకు పాల్పడిన దుండగులు.. స్థానికుల ఆగ్రహం..
Manipur Attacks

Updated on: Jan 02, 2024 | 12:21 PM

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి భగ్గుమంది. తోబల్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలపై కాల్పులకు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం మణిపూర్‌లోని తోబల్‌ జిల్లాలో ముగ్గురు వ్యక్తులను కాల్చి చంపారు దుండగులు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. ఐదుగురు గాయపడ్డారు. అనేకమందికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానిక ప్రజలే లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు అల్లరి మూకలు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ స్పందించారు. హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.అమాయక ప్రజల ప్రాణాలు తీయడం బాధాకరమన్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను పంపించామని గాలింపు చర్యల్లో పోలీసులకు సహకరించాలని స్థానికులను కోరారాయన. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు సీఎం. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు.

అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడిన వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు స్థానికులు. మూడు వాహనాలకు నిప్పు పెట్టి నిరసనకు దిగారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేకూర్చేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు బీరేన్‌ సింగ్‌. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో తాజా పరిస్థితులపై సమీక్షించారాయన. తోబల్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌, ఇంఫాల్‌ వెస్ట్‌, కాక్‌చింగ్‌, బిష్ణుపుర్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు.

ఇవి కూడా చదవండి

గత ఏడాది మే నెలలో రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కారణంగా 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతలోనే న్యూ ఇయర్‌ వేడుకల వేళ మరోసారి హింస జరగడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర మణిపూర్‌ నుంచే ప్రారంభించాలనుకున్నారు. ఈ తరుణంలో హింస జరగడంపై కాంగ్రెస్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితులు సద్దుమణగకపోతే రాహుల్‌ న్యాయయాత్ర మణిపూర్‌ నుంచి మరో చోటుకు మారే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..