Congress: అహ్మద్ పటేల్ తర్వాత కాంగ్రెస్‌ ట్రబుల్‌షూటర్ ఎవరు..? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ

Congress New Troubleshooter: దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఘోర పరాభవాలను ఎదుర్కొంటోంది. వరుస ఓటములు, పార్టీలో

Congress: అహ్మద్ పటేల్ తర్వాత కాంగ్రెస్‌ ట్రబుల్‌షూటర్ ఎవరు..? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
Congress Party
Follow us

|

Updated on: Dec 27, 2021 | 1:32 PM

Congress New Troubleshooter: దేశాన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఘోర పరాభవాలను ఎదుర్కొంటోంది. వరుస ఓటములు, పార్టీలో అంతర్గత విబేధాలు, నాయకత్వలేమి లాంటి సమస్యలతో సతమతమవుతూనే జాతీయ పార్టీ మనుగడ కోసం పరితపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత ట్రబుల్‌షూటర్ అహ్మద్ పటేల్ మరణించిన తరువాత.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. అహ్మద్ పటేల్ తర్వాత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో ట్రబుల్‌షూటర్‌గా ఉద్భవించారని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో పార్టీలోని అసమ్మతి నేతలందరూ ఆమె ఇంటి తలుపుతడుతున్నారు. దీంతో ప్రియాంకా గాంధీనే పార్టీలోని అంతర్గత సమస్యలను చక్కదిద్దే నేతగా మారారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ పార్టీని లక్ష్యంగా చేసుకోవడంతో ఉత్తరాఖండ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ముసురుకుంది. దీంతో ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని ఉత్తరాఖండ్‌ పార్టీలో నెలకొన్న పరిస్థితిని చకచకా చక్కదిద్దారు. అసమ్మతి నాయకులను బుజ్జగించి అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడంలో విజయం సాధించారు.  ఎన్నికలకు రాష్ట్ర పార్టీ శ్రేణులు దృష్టి సారించేలా సూచనలు చేశారు. ఓ వైపు ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాలను  చూసుకుంటూనే ఆమె.. మరోవైపు ట్రబుల్‌షూటర్‌గా పార్టీలోని అంతర్గత సమస్యలను పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు.

ప్రియాంక పార్టీలో సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.. ఆమె పంజాబ్‌ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించారు. సీఎంగా అమరీందర్ సింగ్‌ను తొలగించి.. నవజ్యోత్ సింగ్ సిద్ధూను చీఫ్‌గా చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. దీంతోపాటు రాజస్థాన్ రాజకీయాల్లో సైతం ఆమెనే చక్రం తిప్పారు. అశోక్ గెహ్లాట్ – సచిన్ పైలట్ మధ్య సయోధ్య ఏర్పడేలా చేశారు. దీంతోపాటు సచిన్ పైలట్ విధేయులకు ప్రభుత్వంలో స్థానం కల్పించేందుకు ఆమె రాహుల్‌తో కలిసి అశోక్ గెహ్లాట్‌కు నచ్చజెప్పారు. అయితే.. యూపీ ఎన్నికల తర్వాత.. రాహుల్ గాంధీతో సఖ్యతగా లేని నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు.. కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీనే పెద్ద పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా అసంతృప్త నాయకులను, అసమ్మతి సీనియర్ నేతలను సముదాయించడంలో.. లఖింపూర్ ఖేరీ సంఘటన తర్వాత యూపీలో ఆమె చేపట్టిన పోరాటానికి చాలా మంది ఆమెను ప్రశంసించారు.

ఎన్నికల తర్వాత.. దీంతోపాటు రైతు ఉద్యమం, హత్రాస్ ఘటన తర్వాత ప్రియాంక.. తక్కువ వ్యవధిలో సమస్యలను లేవనెత్తడం.. యూపీలో పార్టీని ఆకట్టుకునేలా చేయడంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయినా ప్రస్తుత సర్వే ప్రకారం.. యూపీ ఎన్నికలలో కాంగ్రెస్ లాభపడకపోవచ్చు అని పేర్కొంటున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో ప్రియాంకను స్టార్ క్యాంపెయినర్‌గా చూస్తోంది. ఆమె ప్రసంగాలతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా ఆమెతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. అయితే.. మరికొన్ని రోజుల్లోల జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల ముగిసిన అనంతరం ఆమెకే పార్టీ బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ నాయకత్వం చూస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతన్నారు.

Priyanka Gandhi

Priyanka Gandhi

అసమ్మతి మధ్య.. 

అయితే.. కాంగ్రెస్‌కు నాయకత్వ సమస్య వెంటాడుతుండటంతో.. పార్టీ చీఫ్‌ను ప్రకటించాలని పలువురు నాయకులు సోనియాగాంధీకి సూచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. రాహూల్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి సోనియాగాంధీ తాత్కలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్‌లో ఓ వర్గం రాహుల్ గాంధీని మళ్లీ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతుంటే.. మరో వర్గం గాంధీయేతర నాయకుడిని నియమించాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ అంతర్గత విబేధాల మధ్య ప్రియాంక యూపీ ఎన్నికల తర్వాత పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

కమిటీలో.. 

వాస్తవానికి కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం ఏర్పడినప్పుడు సోనియా గాంధీకి సహాయం చేయడానికి కొలీజియం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కమిటీ వేశారు. ఆంటోని, దివంగత అహ్మద్ పటేల్, అంబికా సోని, కె.సి. వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే పటేల్ మరణానంతరం కమిటీ అప్పుడప్పుడు సమావేశమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రియాంక ట్రబుల్ షూటర్‌ బాధ్యతలను తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని నాయకులు పేర్కొంటున్నారు.

Also Read:

షాకింగ్ ఘటన.. కరోనా వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు.. ఏకంగా పోలీసు అధికారి చేయి విరగ్గొట్టాడు..

Viral Video: మ్యాజిక్ చూసి ఫిదా అయిన చింపాజీ.. రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో