ఆ మహమ్మారితో 13వేల పందులు మృతి చెందాయట..!

దేశంలో ఓ వైపు మనుషులను కరోనా పట్టి పీడిస్తుంటే.. మరోవైపు అసోంలోని పందులను ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వేధిస్తోంది. గత కొన్ని రోజులుగా అసోంలోని పలు జిల్లాలో ఆఫ్రికన్‌ ఫీవర్‌ విస్తరిస్తుండగా..

ఆ మహమ్మారితో 13వేల పందులు మృతి చెందాయట..!

Edited By:

Updated on: May 10, 2020 | 7:22 PM

దేశంలో ఓ వైపు మనుషులను కరోనా పట్టి పీడిస్తుంటే.. మరోవైపు అసోంలోని పందులను ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ వేధిస్తోంది. గత కొన్ని రోజులుగా అసోంలోని పలు జిల్లాలో ఆఫ్రికన్‌ ఫీవర్‌ విస్తరిస్తుండగా.. ఈ వ్యాధి బారిన పడి 13వేల పందులకు పైగా మృత్యువాతపడ్డాయి. ఈ విషయాన్ని అక్కడి పశు సంవర్థక శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడ తొలి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌ కేసు నమోదైంది.

కాగా పందుల్లో ఈ వ్యాధి విస్తరణ ఎక్కువ అవుతోన్న క్రమంలో ఆ వ్యాధిని నివారించేందుకు రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి రంగంలోకి దిగారు. సమీక్ష నిర్వహించి.. స్వైన్ ఫీవర్‌ను నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. ఈ క్రమంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సాయం కోరింది. కాగా 1921లో తొలిసారిగా ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ను ఆఫ్రికాలో గుర్తించారు. చైనాలోని జినియాంగ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న అసోంకు అక్కడి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు.

Read This Story Also: భయాన్ని పోగొడితేనే కరోనాతో సమర్థంగా పోరాడగలం..!