Watch Video: రామమందిరం ఎంత అద్భుతమో.. అయోధ్యలో ప్రధాని మోదీ ఏరియల్ వ్యూ.. వీడియో

|

Jan 22, 2024 | 1:16 PM

యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళయింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగియనుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ముందుగా రామ మందిర ప్రాంతంలో ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు.

Watch Video: రామమందిరం ఎంత అద్భుతమో.. అయోధ్యలో ప్రధాని మోదీ ఏరియల్ వ్యూ.. వీడియో
Pm Modi
Follow us on

యావత్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు వేళయింది. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమయ్యే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒంటి గంటకు ముగియనుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ముందుగా రామ మందిర ప్రాంతంలో ఏరియల్ వ్యూ నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా ప్రాంగణాన్ని పరిశీలించారు. రామమందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. ప్రధాని మోదీ సహా 7 వేల మందికి పైగా ప్రముఖులు, అతిథుల సమక్షంలో ఈ మహత్తర కార్యం జరగనుంది. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని లక్షల మంది టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లలో వీక్షించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 వేల మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు కల్పించారు. నిరంతర నిఘా కోసం 10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు అధికారులు. డ్రోన్లనూ రంగంలోకి దించారు.

రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని భారత్‌లోనే కాదు…విదేశాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాషింగ్టన్‌ డీసీ మొదలుకొని.. పారిస్‌, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఏరియల్ వ్యూ వీడియో చూడండి..

వీవీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. మెరుగైన భద్రత కోసం ఏఐ సాంకేతికతను కూడా వినియోగించుకొంటున్నట్టు లా అండ్‌ ఆర్డర్‌ డీజీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

రామమందిర ప్రారంభోత్సవానికి విచ్చేసే వీఐపీలకు నిర్వాహకులు మహాప్రసాదాన్ని అందజేయనున్నారు. నెయ్యి, ఐదు రకాల డ్రై ఫ్రూట్లు, చక్కెర, శనగ పిండితో తయారు చేసిన ఈ మహాప్రసాదాన్ని 20 వేలకు పైగా ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్టు ఆలయ ట్రస్ట్‌ ప్రకటించింది.

ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ ధ్వనుల మధ్య నిర్వహిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళ ధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది.

అయోధ్య దీపాల కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోతోంది. మొత్తం 10 లక్షల దీపాలు వెలిగించనున్నారు. రామమందిరం సహా నగరంలో ఉన్న రామ్‌ కీ పైడీ, కనక్‌ భవన్‌, గుప్తార్‌ ఘాట్‌, సరయు ఘాట్‌, లతామంగేష్కర్‌ చౌక్‌, మణిరాం దాస్‌ ఛవని తదితర ప్రాంతాలు, దాదాపు వెయ్యి ఆలయాలు ఈ దీపాల కాంతులతో వెలిగిపోనున్నాయి.

అయోధ్యలోని ధర్మ మార్గ్‌లో వివిధ వేదికలపై కళాకారులు జానపద నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. ఆ నృత్యాలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు వివిధ జానపద నృత్యాలు ప్రదర్శిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..