విజయ్‌ రోడ్‌షోకు సర్కార్‌ నో.. కార్నర్‌ మీటింగ్స్‌, రోడ్‌ షోస్‌ రద్దు!

TVK పార్టీ చీఫ్‌ విజయ్‌ రోడ్‌షోకు పుదుచ్చేరి సర్కార్‌ నో చెప్పింది. కార్నర్‌ మీటింగ్స్‌, రోడ్‌ షోస్‌ను రద్దు చేసుకున్న టీవీకే పార్టీ, భారీ బహిరంగ సభకు సిద్దమవుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో టీవీకే ప్రచారానికి ఆ పార్టీ చీఫ్‌ విజయ్‌ రోడ్‌ షో నిర్వహించాలనుకున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాలు రూట్‌ మ్యాప్‌ కూడా సిద్దం చేశాయి. అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు లేఖ రాశారు.

విజయ్‌ రోడ్‌షోకు సర్కార్‌ నో.. కార్నర్‌ మీటింగ్స్‌, రోడ్‌ షోస్‌ రద్దు!
Actor Vijay, Tvk Party

Updated on: Dec 05, 2025 | 8:20 AM

TVK పార్టీ చీఫ్‌ విజయ్‌ రోడ్‌షోకు పుదుచ్చేరి సర్కార్‌ నో చెప్పింది. కార్నర్‌ మీటింగ్స్‌, రోడ్‌ షోస్‌ను రద్దు చేసుకున్న టీవీకే పార్టీ, భారీ బహిరంగ సభకు సిద్దమవుతోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో టీవీకే ప్రచారానికి ఆ పార్టీ చీఫ్‌ విజయ్‌ రోడ్‌ షో నిర్వహించాలనుకున్నారు. ఆ మేరకు పార్టీ వర్గాలు రూట్‌ మ్యాప్‌ కూడా సిద్దం చేశాయి. అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులకు లేఖ రాశారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని కలిసి రోడ్‌ షోలకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు టీవీకే పార్ట నేత ఆనంద్‌. అయితే కరూర్‌ ఘటన దృష్ట్యా విజయ్‌ రోడ్‌ షోలకు, కార్నర్‌ మీటింగ్‌లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్, డీఎంకే నాయకులు డిమాండ్‌ చేశారు. మరోవైపు విపక్షాల అభ్యంతరాలతో వివాదం ముదరడంతో సీఎం రంగస్వామి ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు. రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లకు అనుమతినిస్తే క్రౌడ్‌ను కంట్రోల్‌ చేయడం కష్టం అవుతుందని సీఎంకు వివరించారు పోలీసులు.

జనం భారీగా వస్తే తొక్కిసలాట జరిగే అవకాశం వుందని చెప్పడంతో టీవీకే రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్స్‌కు పుదుచ్చేరి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కావాలంటే భారీ బహిరంగ సభలు నిర్వహించుకోవచ్చు, కానీ ప్రజాభద్రత దృష్ట్యా రోడ్‌ షోలు, కార్నర్ మీటింగ్‌లు సరికావన్నారు పుదుచ్చేరి స్పీకర్‌ సెల్వం. పుదుచ్చేరి ప్రభుత్వ నిర్ణయంతో షోస్‌ను రద్దు చేసుకున్న టీవీకే పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర 9న చెన్నై-పుదుచ్చేరి హైవే సమీపంలోని ఉప్పలం ఏరియాలోని మైదానంలో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని పుదుచ్చేరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు టీవీకే నాయకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..