AAP vs BJP: ఢిల్లీలో కొనసాగుతున్న హైడ్రామా.. అసెంబ్లీ ఆవరణలో ఆప్‌, బీజేపీ ఎమ్మెల్యేల పోటాపోటీ నిరసనలు

|

Aug 30, 2022 | 7:54 AM

రాత్రంతా అసెంబ్లీ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు. జరగని లిక్కర్‌ స్కాంపై LG దర్యాప్తుకు ఆదేశించారని.. ఆయనే పెద్ద అవినీతిపరుడని ఆరోపిస్తున్నారు

AAP vs BJP: ఢిల్లీలో కొనసాగుతున్న హైడ్రామా.. అసెంబ్లీ ఆవరణలో ఆప్‌, బీజేపీ ఎమ్మెల్యేల పోటాపోటీ నిరసనలు
Aap Vs Bjp
Follow us on

ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. ఆప్‌, LG, మధ్యలో బీజేపీ.. వీరి మధ్య ఫైట్‌ పీక్స్‌కు చేరింది. ఇటు ఆప్‌ ఎమ్మెల్యేలు అటు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. రాత్రంతా అసెంబ్లీ ఆవరణలోనే నిరసన వ్యక్తం చేశారు. జరగని లిక్కర్‌ స్కాంపై LG దర్యాప్తుకు ఆదేశించారని.. ఆయనే పెద్ద అవినీతిపరుడని ఆరోపిస్తున్నారు ఆప్‌ ఎమ్మెల్యేలు. LG సక్సేనా రాజీనామా చేయాలని.. ఆయన అవినీతిపై CBI, ED దర్యాప్తు చేయాలని ఆందోళనలు చేపట్టారు. అయితే లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా రాజీనామా చేయాలని ఆందోళనలకు దిగింది బీజేపీ.

అయితే లిక్కర్‌ స్కాంలో సీబీఐ తన ఇంట్లో 14 గంటల పాటు సోదాలు చేసినప్పటికి ఏమి దొరకలేదన్నారు డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా. మరికొన్ని గంటల్లో తన బ్యాంక్‌ లాకర్లను కూడా సీబీఐ తనిఖీలు చేయబోతోందని ట్వీట్‌ చేశారు . బ్యాంక్‌ లాకర్లలోనూ సీబీఐకి ఏమీ దొరకదన్నారు.

మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం కేజ్రీవాల్‌. ఇవాళ విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ జరగనుంది. అయితే ఈ విశ్వాస పరీక్షలో ఈజీగా గట్టెక్కనుంది ఆమ్‌ఆద్మీ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలకు గానూ..ఆప్‌కు 63మంది సభ్యుల బలముంది. బీజేపీకి కేవలం 8మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో ఆప్‌ ఈజీగా మెజార్టీ నిరూపించుకునే అవకాశముంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం