జుడిషియల్ కస్టడీకి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుసేన్

మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుసేన్ ని ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జుడిషియల్ కస్టడీకి  రిమాండ్ చేసింది. ఈశాన్య ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు నసంబంధించి ఇతనిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈడీ కస్టడీ గురువారంతో ముగిసిందని, అయితే ఈ గడువును పెంచాలని తాము కోరడంలేదని ఈ సంస్థ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు తెలిపారు. తాహిర్ ని మళ్ళీ తీహార్ జైలు అధికారులకు అప్పగించామన్నారు. సీఏఏని […]

జుడిషియల్ కస్టడీకి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్  హుసేన్

Edited By:

Updated on: Sep 10, 2020 | 7:06 PM

మనీలాండరింగ్ కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుసేన్ ని ఢిల్లీలోని ట్రయల్ కోర్టు జుడిషియల్ కస్టడీకి  రిమాండ్ చేసింది. ఈశాన్య ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు నసంబంధించి ఇతనిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈడీ కస్టడీ గురువారంతో ముగిసిందని, అయితే ఈ గడువును పెంచాలని తాము కోరడంలేదని ఈ సంస్థ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు తెలిపారు. తాహిర్ ని మళ్ళీ తీహార్ జైలు అధికారులకు అప్పగించామన్నారు.

సీఏఏని నిరసిస్తూ గత ఫిబ్రవరిలో  ఆందోళనకారులు నిర్వహించిన ప్రదర్శనలను ఇతగాడు తన సహచరులతో రెచ్ఛగొట్టాడని, తన ఇంటిపై నుంచి పెట్రోలు బాంబులు, రాళ్లతో వారిపై దాడి చేశాడన్న ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి.