Diband Waterfalls: వావ్ బ్యూటిఫుల్.. అచ్చం పాల ధారలా..!.. ఫిదా అవుతున్న నెటిజన్లు

|

Dec 01, 2022 | 7:39 AM

విశాల విశ్వంలో ప్రకృతి అందాలకు కొదవ లేదు. కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, జలపాతాలు.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనసుతో చూడేలే గానీ.. ప్రతి రాయీ ఒక ప్రాణమున్న..

Diband Waterfalls: వావ్ బ్యూటిఫుల్.. అచ్చం పాల ధారలా..!.. ఫిదా అవుతున్న నెటిజన్లు
Diband Waterfalls
Follow us on

విశాల విశ్వంలో ప్రకృతి అందాలకు కొదవ లేదు. కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, జలపాతాలు.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనసుతో చూడేలే గానీ.. ప్రతి రాయీ ఒక ప్రాణమున్న శిల్పంలా కనిపిస్తుంది. ఎన్నో అందాలకు నెలవైన ప్రకృతిలో ఉల్లాసంగా గడిపేందుకు టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రకృతిలో ఎన్నో అందాలు నిండి ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు వీటిని చూసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అందులో జలపాతాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆకాశం నుంచి జారి పడుతున్నాయా అన్నట్టుగా కనువిందు చేసే జలపాతాలంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దివి నుంచి భువికి జాలువారే నీటి అందాలను చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే. అయితే ఒక్కో జలపాతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వర్షా కాలంలో అవి మరింత కనువిందు చేస్తూ ట్రెండ్ అవుతుంటాయి. జలసవ్వడులతో కొండల మధ్యనుంచి జాలువారుతూ ఆకర్షిస్తుంటాయి. అలాంటి జలపాతాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిబంగ్‌ వ్యాలీ వాటర్‌ఫాల్స్‌ ఒకటి.

ఈ జలపాతం ప్రస్తుతం ప్రకృతి ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాలధారలా కొండపై నుంచి కిందకు జాలువారుతూ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. పాలా..? నీళ్లా..? అని భ్రమపడేలా ఉన్న ఈ జలపాతానికి సంబంధించిన వీడియోను అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘దేఖో అప్‌నా దేశ్‌’ క్యాంపెయిన్‌లో భాగంగా ఆయన ఈ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘వావ్‌.. బ్యూటిఫుల్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..