Viral Video: డేంజర్ జర్నీ అంటే ఇదే.. ఇందులో ప్రయాణించాలంటే లైఫ్ రిస్క్ లో పెట్టాల్సిందే..

|

Jan 21, 2023 | 6:14 PM

ఇటీవల నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ఎలా జరిగిందనే...

Viral Video: డేంజర్ జర్నీ అంటే ఇదే.. ఇందులో ప్రయాణించాలంటే లైఫ్ రిస్క్ లో పెట్టాల్సిందే..
Danger Journey
Follow us on

ఇటీవల నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సహా మొత్తం 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై కచ్చితమైన ఆధారాలు ఇప్పటికీ తెలియరాలేదు. ప్రమాదానికి వాతావరణం కారణం కాదని, సాంకేతిక లోపం అని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి నేపాల్ దేశంలో పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఘాట్ రోడ్లూ అధికమే. ఈ కారణంగా నేపాల్ లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా సార్లు విరిగిన రోడ్లు లేదా వంతెనల కారణంగా, వాహనాలు అవతలి వైపుకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందులో వాహనాలను రోడ్డు దాటేలా చూపించిన విధానం అద్భుతంగానూ, ఆశ్చర్యంగానూ ఉంది.

ఈ వీడియోలో ఒక పెద్ద లోతైన అగాథం ఉండటాన్న చూడవచ్చు. దానికి ఇరువైపులా జనాలు నిలబడి ఉన్నారు. అయితే అటూ ఇటూ రాకపోకలు సాగించేందుకు అక్కడ బ్రిడ్జ్ లేదు. దీంతో రోప్ వే ద్వారా వాహనాలను లోయ దాటించారు. ఇది తప్ప ఇతర పరిష్కారం వారికి కనిపించలేదు. ప్రమాదమని తెలిసినా.. వాహనానికి గట్టి తాడు కట్టి రోప్ వే ద్వారా అవతని ఒడ్డుకు తరలించారు. అయితే.. వైర్ తెగిపోతే మాత్రం చాలా ప్రమాదకరం అనే విషయం మనకు అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ‘నేపాల్‌లో ప్రజా రవాణా’ అనే క్యాప్షన్ ఇచ్చారు. కేవలం 14 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోకు 7 లక్షల 48 వేలకు పైగా వ్యూస్, వందలాది లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ‘ఇది నిజంగా సాహసమే… బస్సులో ఉన్న ఆ ధైర్యవంతులైన ప్రయాణికుల గురించి ఆలోచించండి’ అని కొందరు, ‘ఎగిరే రహదారి’ అని మరికొందరు రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..