Video Viral: బ్రేక్ వేయబోయి యాక్సిలరేటర్ తొక్కిన మహిళ.. దెబ్బకు సీనే మారిపోయింది.. వైరల్ వీడియో..

|

Jan 20, 2023 | 5:58 PM

ప్రస్తుత రోజుల్లో సొంత కారు కలిగి ఉండటం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. అంతే కాకుండా కారును వారే నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో చాలా మంది కారు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. పూర్తిగా...

Video Viral: బ్రేక్ వేయబోయి యాక్సిలరేటర్ తొక్కిన మహిళ.. దెబ్బకు సీనే మారిపోయింది.. వైరల్ వీడియో..
Car Accident
Follow us on

ప్రస్తుత రోజుల్లో సొంత కారు కలిగి ఉండటం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు. అంతే కాకుండా కారును వారే నడిపేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో చాలా మంది కారు డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. పూర్తిగా నేర్చుకున్నాక రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. కానీ మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా.. కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఘటనే జరిగింది. వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. గుజరాత్‌లోని వడోదరలో అలాంటి వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ కారు అదుపుతప్పి స్టోర్‌లోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మహిళ పార్క్ చేసే సమయంలో బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడం వల్ల ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుకాణం యజమాని మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ షాకింగ్ ఇన్సిడెంట్.. బుధవారం రాత్రి వడోదరలోని అల్కాపురి ప్రాంతంలో జరిగింది. కారు పార్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌ను నొక్కింది. దీంతో కారు మెట్లు ఎక్కి షోరూం లోపలికి ప్రవేశించింది. ఈ తతంగమంతా క్రకరీ స్టోర్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఇవి కూడా చదవండి

షోరూమ్ యజమాని మహేశ్‌భాయ్ సింధాని పోలీస్ స్టేషన్‌లో మహిళపై ఫిర్యాదు చేశారు. టపాసులు కొనుగోలు చేసేందుకు ఆ మహిళ దుకాణానికి వచ్చింది. కారు ఢీకొనడంతో షోరూమ్‌లోని ఒకవైపు అద్దాలు మొత్తం పగిలిపోయాయి. భారీ శబ్దంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..