మరోసారి బయటపడ్డ భద్రతా లోపం.. పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డ అనుమానితుడు!

మరోసారి పార్లమెంటు భవనంలో భద్రతా వైఫల్యం బయటపడింది. శుక్రవారం (ఆగస్టు 22) అనుమానాస్పద వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఈ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి చెట్టు సహాయంతో ప్రహారీ గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. అతను రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనం గరుడ గేటు వద్దకు చేరుకున్నాడు

మరోసారి బయటపడ్డ భద్రతా లోపం.. పార్లమెంట్ భవనంలోకి చొరబడ్డ అనుమానితుడు!
Parliament House

Updated on: Aug 22, 2025 | 12:58 PM

మరోసారి పార్లమెంటు భవనంలో భద్రతా వైఫల్యం బయటపడింది. శుక్రవారం (ఆగస్టు 22) అనుమానాస్పద వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఈ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి చెట్టు సహాయంతో ప్రహారీ గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించాడు. అతను రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనం గరుడ గేటు వద్దకు చేరుకున్నాడు. ఇది గమనించిన పార్లమెంట్ భవనంలో ఉన్న భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు చేసిన వ్యక్తిని సూరత్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. అతని మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక యువకుడు గోడపై నుండి దూకుతున్నట్లు PCR సిబ్బంది చూశారు. అక్కడ గోడ ఎత్తు తక్కువగా ఉండటంతో దుండగుడు లోపలికి వచ్చినట్లు భద్రతా దళాలు తెలిపాయి. PCR సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు, పారిపోయేందుకు యత్నించాడు. శబ్దం విన్న CISF అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. స్పెషల్ సెల్, IB, ఇతర సంస్థలు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..