యువతితో పాస్టర్ రాసలీలలు.. చివరికి జైల్లో ఊచలు

|

Mar 22, 2023 | 7:13 AM

దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు ఉన్నట్లో దొంగ పాస్టర్లు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది.

యువతితో పాస్టర్ రాసలీలలు.. చివరికి జైల్లో ఊచలు
Arrest
Follow us on

దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు ఉన్నట్లో దొంగ పాస్టర్లు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి ఘటనే తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. ఓ చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్న యాంటో అనే వ్యక్తి పైకి పాస్టర్ ల కనిపించినా లోపల మాత్రం రాసలీలలు నడిపిస్తున్నాడు. నర్సింగ్ చదువుతున్న ఓ కాలేజీ విద్యార్థినిని బుట్టలో వేసుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు , వీడియోలు తీశాడు. వాటిని చూపిస్తూ ఆ యువతిని లైంగికంగా వేధిస్తూ హింసించాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఆ యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. అలాగే కన్యాకుమారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పాస్టర్ యాంటో కోసం గాలించిన పోలీసులు చివరికి అతడ్ని అరెస్టు చేశారు. అతడ్ని విచారించగా ఈ నిజాలన్ని బయటపడ్డాయి. మరోవైపు ఈ పాస్టర్ చేసిన రాసలీలలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.