16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్దుడు అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి కొడుకు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం బయటపడింది. 16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే ఈ అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను ఆ వృద్ధుడి కుమారుడే ఫోన్‌లో రికార్డు చేశాడు. అయితే ఈ ఘటన ఏప్రిల్‌లో జరిగినప్పటికీ ఈ వీడియో బయటపడటంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్దుడు అత్యాచారం.. వీడియో తీసిన నిందితుడి కొడుకు
Assault

Updated on: Jun 30, 2023 | 4:20 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం బయటపడింది. 16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. మరో విషయం ఏంటంటే ఈ అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను ఆ వృద్ధుడి కుమారుడే ఫోన్‌లో రికార్డు చేశాడు. అయితే ఈ ఘటన ఏప్రిల్‌లో జరిగినప్పటికీ ఈ వీడియో బయటపడటంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి పక్కనే ఆ వృద్ధుడు ఉండేవాడు. అతడు తరచుగా ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి రావడం అలాగే వాళ్లతో ఆధ్మాత్మిక యాత్రలకు కూడా వెళ్తుండేవాడు. ఓ రోజున ఆ వృద్ధుడు బాలికకు ఏదో విషయం చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ఇంట్లోని ఓ మూలకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. దీంతో ఆ బాలిక ఈ విషయం గురించి ఎవరికి చెప్పలేదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆ వృద్ధుడి కొడుకు(40) తన తండ్రి చేతబడులు చేస్తున్నాడేమో అన్న అనుమానం కలిగింది. దీనికి సంబంధించిన వీడియో తీయాలని ఆ గదిలో రహస్యంగా ఫోన్ రికార్డు చేసి పెట్టాడు. కానీ అందులో అతడు ఆ బాలికపై చేసిన అఘాయిత్యం రికార్ట్ అయ్యింది. ఇటీవల ఆ వృద్ధుడి కొడుకు బాధితురాలి తండ్రికి ఈ విడియో చూపించాడు. చివరికి అతను పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఆ వృద్ధుడికి తన కొడుకు మధ్య మంచి సంబంధాల్లేవని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అతని కొడుకును అరెస్టు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ఈ వీడియో ఓ ఫోన్లలో ఉందో వాటిని కూడా సీజ్ చేశామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం