Young Man Married to 41Year Old Woman: ప్రేమ ఎప్పుడు, ఎవరిపై, ఎందుకు పుడుతుందో ఎవరికి తెలియదు.. అందుకే ప్రేమ గుడ్డిదంటారు కొంతమంది. వినడానికి ఇబ్బందికరంగా ఉన్నా ఇది వాస్తవం అంతేకాదు పచ్చి నిజం. ఎందుకంటే అప్పుడప్పుడు లోకంలో జరిగే కొన్ని సంఘటనలు వీటికి ఆజ్యం పోస్తాయి. ఓ తెలుగు సినిమాలో హీరో ‘నా కళ్లతో చూడు మామా’ అంటూ ఓ ప్రత్యేక డైలాగ్ చెబుతాడు సరిగ్గా ఈ డైలాగ్ బిహార్‌లో జరిగిన ఓ పెళ్లి సంఘటనకు సెట్ అవుతుంది. ఇక్కడ 21 ఏళ్ల యువకుడు నలుగురు పిల్లలున్న 41 మహిళను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. మరి ఈ వింత లవ్ స్టోరీకి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్‌లోని ఖగడియా జిల్లా దరియాపుర్ పంచాయతీ పరిధి నయాగావ్‌కు చెందిన ఓ మహిళకు 41ఏళ్లు. ఆమెకు నలుగురు పిల్లలున్నారు. భర్త కొద్ది కాలం క్రితం మృతిచెందాడు. కాగా జొరావర్పుర్కు చెందిన 21 ఏళ్ల రవికుమార్అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత రెండేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఇంటికి రవికుమార్ తరచూ వస్తూ ఉంటాడు. ఇది గమనించిన స్థానికులు ఈ వ్యవహారం ఎదో తేడాగా ఉందే అంటూ అనుమానించారు. చివరకు వారనుకున్నదే నిజం అయింది.
ఓ రోజు రవికుమార్ ఇంట్లో ఉండగా గమనించిన స్థానికులు వారిద్దరిని పట్టుకుని అసలు విషయం ఏంటని నిలదీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించి రప్పించారు. దరియాపుర్ సర్పంచ్ శంబుసింగ్, జొరావ్పుర్ సర్పంచ్ పంకజ్ షా ఆ మహిళ ఇంటికి చేరుకుని గ్రామస్థులు, కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వారిద్దరికీ వివాహం జరిపించారు. మొత్తం నలుగురు సంతానంలో ఇద్దరు పిల్లలు కొత్త జంట వద్ద.. మరో ఇద్దరిని ఆ మహిళ తల్లి వద్ద ఉంచేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే వీరిద్దరి పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. బిహార్ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. విషయం తెలిసిన నెటిజన్లు ఇదే రకం ప్రేమ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఆ యువకుడు ఆదర్శప్రాయుడంటూ ప్రశంసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటే జీవితం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరనేది మాత్రం వాస్తవం.