
భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ అన్నారు. 2014 తర్వాత 40 దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్‌లు చేశామని తెలిపారు. మన టెక్స్‌టైల్, ఫార్మా, మత్స్య సంపద రక్షిస్తోందన్నారు. యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులపై భరోసా ఉందన్నారు. త్వరలో Next లెవెల్ రిఫామ్స్ జరగబోతున్నాయన్నారు మోదీ. సప్తధార శక్తితో దేశానికి మరింత ఊతమిస్తామన్నారు. సప్తధార శక్తిలో మొదటిది తయారీ శక్తి.. భారత్‌ని గ్లోబల్ సప్లై చైన్‌గా మార్చాలన్నారు.
గ్లోబల్ మార్కెట్‌లో మన వస్తువులు క్వాలిటీ ఉండాలన్నారు. సప్తధారలో రెండోది ఫుడ్ ప్రొడక్షన్, కెమికల్ ఫ్రీగా ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ ఉండాలన్నారు. సప్తధారలో మూడోది టెక్నాలజీ.. ఏఐ, డేటా సెంటర్స్‌లో ఇన్నోవేషన్ హబ్‌గా ఉండాలన్నారు. సప్తధారలో నాలుగోది గతిశక్తి.. దేశంలో ఫాస్ట్ కనెక్టివిటీ పెరగాలన్నారు. సప్తధారలో ఐదోది రక్షణ శక్తి డిఫెన్స్ రంగంలో భారత్ ఆత్మనిర్భర్‌గా ఎదగాలన్నారు. సప్తధారలో ఆరోది గ్రీన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ
సప్తధారలో ఏడోది యువశక్తి అన్నారు మోదీ.
జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ మోషేన్ రాజుదేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది
యువతకు ఉపాధి కల్పించాలి-చైర్మన్ మోషేన్ రాజు
స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేదేశం నాకు ఏం చేసిందని కాదు..దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి2047నాటికి వికసిత్ భారత్,స్వర్ణాంధ్ర సాకారం చేయాలివందేళ్ల స్వాతంత్య్ర వేడుకలనాటికి సమృద్ధి సాధించాలి
దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలి-చంద్రబాబు
నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలని సీఎం ఆకాంక్షసమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి-సీఎం రేవంత్సమానత్వంతోనే బలమైన ప్రజాస్వామ్య భారత నిర్మాణం
భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలి-సీఎం రేవంత్
తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
శాసన మండలిలో జెండా ఆవిష్కరించిన చైర్మన్ గుత్తా
దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిజ. ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయజెండా ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మొత్తం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అయితే ఈ సారి దేశ చరిత్రలోనే తొలిసారి జాతీయ గీతం కంటే ముందుగా జాతీయ గేయమైన వందేమాతారాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామన్నారు మోదీ. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోందని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని.. మనం పెద్ద పెద్ద కలలు కనాలని ఆయన అన్నారు.
ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలని.. 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని కల ఉందన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందని.. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందే దేశమని..140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ప్రధా మోదీ అన్నారు. వికసిత్ భారత్ కోసం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని.. ఆత్మ నిర్భార్ భారత్‌గా ఎదగాలన్నారు ప్రధాని మోదీ. మెకిన్ ఇండియా, స్వదేశీ, ఓకల్ ఫర్ లోకల్‌ను దేశ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.
మోదీ ప్రసంగం ఇక్కడ చూడండి..