విదేశాల నుంచి భారత్‌కు భారీగా డ్రగ్స్ తరలిస్తోంది ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా. ఇటీవల సముద్ర జలాల ద్వారా డ్రగ్స్ ఎక్కువగా తరలిస్తోంది. దీంతో కేంద్రం సముద్రంలో ఉండగానే డ్రగ్స్‌ను పట్టుకునేలా టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ నేవీ, NCB, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఆపరేషన్స్‌లో పాల్గొంటాయి.
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక తిరుగుతుందని అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో సాగర్ మంథన్ కోడ్ -ఫోర్ పేరుతో ఆపరేషన్ చేపట్టారు అధికారులు. పోర్ బందర్ దగ్గర సముద్ర తీరంలో నౌకను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇండియన్ నేవీ, ఏటీఎస్, ఎన్‌సీబీ అధికారులు నౌకలో తనిఖీలు చేశారు. ఆ నౌక నుంచి 700 కిలోల డగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్ట్ చేశారు. విచారణలో తాము ఇరాన్ పౌరులమని.. ఆ నౌక ఇరాన్‌కు చెందిందని తెలిపారు స్మగ్లర్లు.
పట్టుబడ్డ డ్రగ్స్ మెత్‌గా పిలిచే మెథం ఫెటమైన్‌గా గుర్తించారు అధికారులు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్‌లో రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుందని తెలిపారు ఎన్సీబీ అధికారులు. ఈ డ్రగ్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు. ఎవరికి సరఫరా చేసేందుకు తీసుకువచ్చారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
గుజరాత్‌లో పట్టుకున్న డ్రగ్స్ వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖరాశారు అధికారులు. 2047 నాటికి డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నామని లేఖలో తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.