అంత పెద్ద రాయి అక్కడ ఎలా దాచావ్ బ్రో.. 500 గ్రాముల కిడ్నీ స్టోన్ తొలగించిన వైద్యులు!

32 ఏళ్ల వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాలుగా కిడ్నీ స్టోన్‌ సమస్యతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ సీనియర్ సర్జన్ డాక్టర్ హెచ్ఎన్ శర్మ కిడ్నీ పరీక్ష చేయగా.. భారీ సైజులో ఉన్న స్టోన్‌ ఉన్నట్లు గుర్తించారు..

అంత పెద్ద రాయి అక్కడ ఎలా దాచావ్ బ్రో.. 500 గ్రాముల కిడ్నీ స్టోన్ తొలగించిన వైద్యులు!
500 Gram Kidney Stone Removed From Madhya Pradesh Man

Updated on: Jan 26, 2026 | 9:06 AM

పన్నా, జనవరి 26: ఓ వ్యక్తికి 20 ఏళ్ల నుంచి నడుం నొప్పి ఉంది. ఎంతో మంది డాక్టర్లను కలిసి చికిత్స తీసుకున్నాడు. కానీ ఎంతకూ నొప్పి తగ్గలేదు. తాజాగా జిల్లాలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అతడి కిడ్నీలో అరకేజీ బరువున్న రాయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్‌ చేసి కిడ్నీ రాయిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాలుగా కిడ్నీ స్టోన్‌ సమస్యతో బాధపడుతున్నాడు. స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు వెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పన్నా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ సీనియర్ సర్జన్ డాక్టర్ హెచ్ఎన్ శర్మ కిడ్నీ పరీక్ష చేయగా.. భారీ సైజులో ఉన్న స్టోన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో డాక్టర్ హెచ్ఎన్ శర్మ నేతృత్వంలోని వైద్యులు ఆపరేషన్ నిర్వహించి.. అతడి కిడ్నీ నుంచి ఏకంగా 500 గ్రాముల రాయిని విజయవంతంగా తొలగించారు. ఆపరేషన్ తర్వాత రోగి నొప్పిని తగ్గిందని, ఆరోగ్యంగా ఉన్నాడని, ప్రస్తుతం కోలుకుంటున్నట్లు డాక్టర్ శర్మ చెప్పారు.

అరుదైన కేసు

దేవేంద్రనగర్ తహసీల్‌ ఇట్వా గ్రామానికి చెందిన బుధ్ సింగ్ అనే రోగికి ఈ కిడ్నీ సర్జరీ జరిగింది. కిడ్నీలోని రాళ్ల నొప్పితో 18 నుంచి 20 ఏళ్లుగా తీవ్రంగా బాధపడుతున్నాడు. గతంలో పలువురు వైద్యుల నుండి చికిత్స తీసుకున్నప్పటికీ దీనినిఎవరూ గుర్తించలేకపోయారు. నొప్పి భరించలేనంతగా మారడంతో ఇటీవల డాక్టర్ హెచ్ఎన్ శర్మను సంప్రదించాడు. ఆయన పరీక్షించి అతని కడుపులో పెద్ద కిడ్నీ రాయి ఉందని, దానికి శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. అనంతరం సింగ్‌ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ శర్మ, ఇతర వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో కలిసి ఆపరేషన్ చేసి భారీ పరిమాణంలో ఉన్న రాయిని తొలగించారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ పొందిన డాక్టర్ శర్మ తన కెరీర్‌లో దాదాపు 65 నుంచి 70 కిడ్నీ స్టోన్ సర్జరీలు చేశానని, అవన్నీ విజయవంతమయ్యాయని చెప్పారు. కానీ ఇప్పటివరకు తొలగించబడిన వాటిలో ఇదే అతిపెద్ద రాయి అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.