UP Elections: యూపీలో హ్యాట్రిక్ లక్ష్యంపై బీజేపీ నజర్.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై విపక్షాల కసరత్తు!

పేరుకే అది ఉత్తర ప్రదేశ్‌. పొలిటికల్‌ పవర్‌లో మాత్రం.. దేశం మొత్తాన్ని దిక్కులతో సంబంధం లేకుండా షేక్‌ చేసేస్తుంది. ఆ రాష్ట్రంలో గెలిస్తే ఒకరకంగా దేశాన్ని గెలిచినట్టుగా భావిస్తుంటాయ్‌ రాజకీయ పార్టీలు. అందుకే, అక్కడ ఎప్పుడు ఎన్నికలొచ్చినా జప్పున జాగృతం అయిపోతుంటాయ్‌. ఇప్పుడు కూడా అలాంటి సిట్యుయేషనే కనిపిస్తోంది. ఏళ్లుగా అక్కడ ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. అటు, అధికారం కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ.

UP Elections: యూపీలో హ్యాట్రిక్ లక్ష్యంపై బీజేపీ నజర్.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై విపక్షాల కసరత్తు!
2027 Up Assembly Elections (2)

Updated on: Nov 16, 2026 | 10:26 PM

దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉత్తరప్రదేశ్‌.. మరోసారి చర్చల్లోకి వచ్చింది. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో.. ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. యూపీ ఫలితాలు 2029 సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో… వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కమలం పార్టీ.. ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, ఆ ప్రయత్నాలను అడ్డుకుని తీరుతామంటోంది ఇండి కూటమి. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీ… యూపీలో అధికారం దక్కించుకుని చాలా సంవత్సరాలే అయ్యింది. అప్పట్లో ఓ ఊపు ఊపిన హస్తం పార్టీ.. క్రమంగా ప్రాభవం కోల్పోయింది. ఇతర పార్టీలతో జతకడుతూ సింగిల్‌ డిజిట్‌ దక్కించుకోవడమే గగనమన్నట్టుగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ బలం పుంజుకుని… వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలో మరోసారి జంగ్‌ సైరన్‌ మోగించింది. ఈ కసరత్తులో భాగంగానే..మథురలో రెండురోజులపాటు కీలక సమావేశం నిర్వహిస్తోంది బీజేపీ. ఈ మీటింగ్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులు పాల్గొని.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య మరింత సమన్వయంపైనా, కుల సమీకరణాలపైనా చర్చిస్తారు. అయితే, బీజేపీని జాతీయ స్థాయిలో కట్టడి చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌… అందుకు యూపీ అసెంబ్లీ ఎన్నికల్ని వేదికగా...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి