రైతులకు అండగా ఉండేందుకు యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 20లక్షల మంది రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని యోగి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆకుకూరలు, కూరగాయల పెంపకానికి ప్రోత్సాహమివ్వాలనే ఉద్దేశంతో యూపీలోని యోగి సర్కారు రాష్ట్రంలోని 20 లక్షలమంది రైతులకు ఉచితంగా విత్తనాలను అందించనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహీ ఈ విషయాన్ని తెలిపారు. రైతుల అండగా ఉండేందుకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని, పూర్వాంచల్‌లో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలన్న ఉద్దేశంతో పండ్లు, కూరగాయల విత్తనాలను ఉచితంగా ఇవ్వనున్నామని షాహీ తెలిపారు. గడచిన మూడేళ్లలో రూ. 300 కోట్లను వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించామని సూర్యప్రతాప్ షాహీ గుర్తుచేశారు