లోయలో ఉగ్రదాడి.. అమరులైన ఇద్దరు పోలీసులు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్వాతంత్ర దినోత్స వేడుకలు మరో రోజు ఉందన్న సమయంలో శ్రీనగర్‌లోని నౌగామ్‌ జిల్లాలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు..

లోయలో ఉగ్రదాడి.. అమరులైన ఇద్దరు పోలీసులు

Edited By:

Updated on: Aug 14, 2020 | 3:36 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్వాతంత్ర దినోత్స వేడుకలు మరో రోజు ఉందన్న సమయంలో శ్రీనగర్‌లోని నౌగామ్‌ జిల్లాలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు వీరమరణం పొందారు. మరోకరు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలిపారు. నౌగామ్‌ బైపాస్ రోడ్డులో పోలీస్ పార్టీపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు దిగారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. మరోకరి ఆరోగ్యం కాస్త నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం దేశ వ్యాప్తంగా జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లోయలో పోలీసులు, భద్రతా బలగాలు కూంబింగ్ చేపడుతున్నారు.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం