E-Bikes Fire Accident: ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో మంటలు.. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక

|

Apr 14, 2022 | 6:24 PM

E-Bikes Fire Accident: ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఛార్జ్ పెట్టె క్రమంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ (Battery Charging) విషయంలో తగిన జాగ్రత్తలుతీసుకోవాలని..

E-Bikes Fire Accident: ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో మంటలు.. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక
E Bikes Burnt Chennai Showr
Follow us on

E-Bikes Fire Accident: ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ ఛార్జ్ పెట్టె క్రమంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ (Battery Charging) విషయంలో తగిన జాగ్రత్తలుతీసుకోవాలని.. నిర్లక్ష్యం వహించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మార్చి 26 వతేదీన తమిళనాడు(Tamilanadu) లోని వేలూరు లో ఎలక్ట్రిక్ బైక్ కి మంటలకి దగ్ధం అయింది. తాజాగా ఇదే తరహాలో  నేడు చెన్నై శివార్లలో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఈరోజు చెన్నై లోని పోరూర్ లో మరో ఘటన

చెన్నై పోరూర్ సమీపంలోని ప్రైవేట్ ఎలక్ట్రిక్ బైక్ షో రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు షో రూంలో ఉన్న ఎలక్ట్రిక్ బైక్లు అగ్నికి ఆహుతి ఆయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు. షోరూం సిబ్బంది బ్యాటరీ ఛార్జ్ పెట్టేక్రమంలో పేలడం తో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాధమిక అంచనావేశారు. చెన్నై శివరాల్లోనే ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు ఛార్జ్ పెట్టె క్రమంలో పేలడం ఇది రెండో సారి. నెలరోజుల వ్యవధిలోనే ఇలా రెండు ఘటనలు జరిగాయి. బ్యాటరీ ఛార్జ్ పెట్టేక్రమంలో అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

వేలూరులో కూడా ఇదే తరహా ప్రమాదం:

గత నెల 26వ తేదీ తమిళనాడులో ఎలక్ట్రిక్‌ బైకు పేలి తండ్రీకూతుళ్లు.. చనిపోయారు. ఈ ఘ‌ట‌న వెల్లూరు సమీపంలోని అల్లపురంలో ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో ఈ బైక్ పేలి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ‌ వ్యాపించడంతో ఊపిరాడక ఇద్దరూ మరణించారు. అల్లాపురంలోని టోల్‌గేట్ సమీపంలో ఎం.దురైవర్మ(49) చాలా ఏళ్లుగా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ.. జీవ‌నం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయ‌న కొత్త ఈ-బైక్‌ను కొనుగోలు చేశారు. రోజువారి లాగానే.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్‌ పెట్టారు. అయితే విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ-బైక్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంట‌నే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేసినప్పటికీ పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు తండ్రీకూతుళ్లు.

Also Read:

Vontimitta: రేపు పున్నమి వెన్నెలల్లో సీతమ్మని పెళ్లాడనున్న రామయ్య.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్