అతివేగానికి 16 మంది బలి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్ జిల్లాలోని జంకా క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కు అదుపుతప్పి రెండు టెంపో వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు అతివేగమే ఈ ఘటనకు కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ముందుగా వెళ్తున్న టెంపోలను వేగంగా ఢీకొట్టిన ట్రక్కు.. పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. క్షతగాత్రులను స్థానిక […]

అతివేగానికి 16 మంది బలి

Edited By:

Updated on: Aug 27, 2019 | 2:40 PM

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాజహాన్‌పూర్ జిల్లాలోని జంకా క్రాసింగ్ వద్ద ఓ ట్రక్కు అదుపుతప్పి రెండు టెంపో వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు అతివేగమే ఈ ఘటనకు కారణమని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ముందుగా వెళ్తున్న టెంపోలను వేగంగా ఢీకొట్టిన ట్రక్కు.. పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us