పవన్ ఎమ్మెల్యేకు లోకేశ్ సపోర్ట్..వైసీపీపై విమర్శలు

Nara Lokesh condemns janasena mla rapaka varaprasad Arrest

సోషల్ మీడియాలో అధికార వైసీపీపై ఎక్కుపెడుతున్న టీడీపీ నేత లోకేశ్..ట్విట్టర్ వేదికగా మరోసారి జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.  జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని.. ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికార పార్టీ నియంతృత్వ వైఖరితో ముందుకెళ్తుందని..ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిల్చుంటే అరెస్టులు చేస్తుందని మండిపడ్డారు.

‘పత్రికా విలేకరిని చంపుతానన్న ఎమ్మెల్యేని అరెస్టు చేయని ప్రభుత్వం… మలికిపురం ఘటనలో ప్రజల తరఫున ప్రశ్నించిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేసింది. అంటే ఏమిటి? అధికారం ఉంటే ఎంత దౌర్జన్యమైనా చేయొచ్చు. ప్రతిపక్షం మాత్రం న్యాయమడిగినా తప్పా? ఏమిటీ నియంతృత్వం?’ అని ప్రశ్నిస్తూ ట్విటర్​లో లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *