Breaking News
  • భారత్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌. దేశంలో 51 లక్షల 18 వేలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు . భారత్‌లో కొత్తగా 97,894 కేసులు, 1,132 మంది మృతి. భారత్‌లో మొత్తం కేసులు 51,18,254, మొత్తం మరణాలు 83,198. యాక్టివ్‌ కేసులు 10,09,976, డిశ్చార్జయినవారు 40,25,079 మంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6,05,65,728 మందికి కరోనా టెస్టులు.
  • బంగాళాఖాతంలో ఈనెల 20 అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఉత్తర కోస్తాపై 3.1కి.మీ ఎత్తున ఉపరితల ఆవర్తనం. తెలంగాణపై 2.1 కి.మీ ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం. ఈరోజు, రేపు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు . -వాతావరణశాఖ .
  • విజయవాడ: ఏపీలో 1,658 మంది ఖైదీలకు కరోనా. వైరస్ సోకి ఒకరు మృతి. కడప సెంట్రల్ జైల్లో అత్యధికంగా 360 మంది ఖైదీలకు కోవిడ్. వీరిలో 349 మంది కోలుకున్న ఖైదీలు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 383 మంది ఖైదీలకు కరోనా. నెల్లూరు సెంట్రల్ జైల్లో 72 మందికి కరోనా. జిల్లా, సబ్ జైల్లో కోవిడ్ బారిన పడిన వారిలో ఎక్కువ మంది రిమాండు ఖైదీలు. జైళ్లలో ప్రస్తుతానికి 250 క్రియాశీల కేసులు.
  • తూ.గో: నేడు ఏపీ బీజేపీ చలో అమలాపురం . అమలాపురం చేరుకున్న బీజేపీ సీనియర్ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, మాధవ్ . విష్ణువర్ధన్‌రెడ్డి, మాధవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు . చలో అమలాపురం సందర్భంగా బీజేపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు. నెల్లూరు జిల్లా కావలిలో ఆదినారాయణరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు . వాకాటి నారాయణరెడ్డి, ఆంజనేయులు సహా పలువురి హౌస్‌ అరెస్ట్‌. అమలాపురంలో భారీగా మోహరించిన పోలీసులు . గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .
  • తిరుమల: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపటి నుంచి ఈ నెల 27 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏకాంత బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీవారి ఆలయం. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్న టీటీడీ.
  • అమరావతి: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. భేటీకి హాజరైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు . దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపణ. ఎంపీ దుర్గాప్రసాద్‌ సంతాప తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చను.. వైసీపీ బాయ్‌కాట్ చేయడం నీచం- చంద్రబాబు. కనీసం ఎంపీ కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించలేదు. రాష్ట్రానికి జీఎస్టీ నిధులు రాబట్టడంపై వైసీపీకి శ్రద్ధలేదు-చంద్రబాబు. అంతర్వేది సహా ఆలయాల దాడులపై సీబీఐ దర్యాప్తు చేయాలి- చంద్రబాబు.

ఐదు సంవత్సరాల తరువాత తమిళ్‌లోకి

, ఐదు సంవత్సరాల తరువాత తమిళ్‌లోకి

ఐదు సంవత్సరాల తరువాత తమిళనాట రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు నాని. ‘వెప్పమ్’ మూవీ ద్వారా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాని.. ‘అహా కల్యాణం’ తరువాత ఏ తమిళ చిత్రంలోనూ నటించలేదు. అలాగే ఆయన నటించిన ఏ తెలుగు చిత్రం తమిళ్‌లో డబ్ అవ్వలేదు. అయితే తాజాగా జెర్సీతో మళ్లీ కోలీవుడ్‌లోకి వెళ్లనున్నాడు నాని. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగా మొదటి పాటను తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.


ఈ చిత్రంలో నాని సరసన నటించిన శ్రద్ధా శ్రీనాథ్‌కు కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటం.. సంగీత దర్శకుడు అనిరుధ్‌ కూడా అక్కడివాడే కావడంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌మైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ‘ఎమ్‌సీఏ’ తరువాత కాస్త వెనుకబడ్డ నాని ఈ చిత్రంతో మళ్లీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.

Related Tags