Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..!

Balayya Sending Mokshagna To USA, నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..!

ఎన్టీఆర్…తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని, తరిగిపోని ఇమేజ్ ఉన్న నేమ్ ఇది. పారాణికం, జానపదం, ఫాంటసీ..ఏ జానర్ సినిమా చేసినా, అందులో ఏ పాత్ర వేసినా..అచ్చుగుద్దినట్టు దిగిపోయేవాడు ఎన్టీవోడు. కేవలం సినిమాలే కాదు..రాజకీయాల్లో కూడా ఆయనో సెన్సేషన్. ఆయన తర్వాత నెక్ట్ జనరేషన్ హీరోలుగా తెరపైకి వచ్చిన బాలకృష్ణ, హరికృష్ణ ఆయన పేరుని నిలబెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ విభిన్న ప్రయత్నాలతో తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక మూడవ జరరేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న సినిమా ఫీల్డ్‌కి వచ్చినా..ఒక్క జూనియర్ మాత్రమే ఇండస్ట్రీ టాప్ హీరోగా దుమ్ములేపుతున్నారు. అందరివి కలుపుకున్నా ఏడాదికి రెండు, మూడు సినిమాలు రావడమే గగనమైంది.

అందుకే ఇప్పుడు నందమూరి అభిమానుల చూపంతా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞపై పడింది. ఈ కుర్రాడు ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడా అని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పలుసార్లు మోక్షు ఎంట్రీ కన్ఫామ్ అయిందని టాక్ వచ్చినా..అవన్ని రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కానీ ఈ నందమూరి వారసుడు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదనే వార్త చాలామందిని షాక్‌కి గురిచేసింది. అయితే బాలయ్య మాత్రం మోక్షు ఎంట్రీపై అభిమానులకు అదిరిపోయే హోప్ ఇచ్చారు. త్వరలోనే తనయుడ్ని అమెరికా పంపాలని..నటసింహం నిర్ణయం తీసుకున్నారట. న్యూయార్క్‌లోని లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ చేసేందుకు మోక్షూ ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Balayya Sending Mokshagna To USA, నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..!

 

Related Tags