ఒక్క సీన్‌ కోసం అంత పెద్ద గొడవ చేసిన సుకుమార్

Phani.ch

10 May 2024

సుకుమార్‌ కెరీర్‌ ప్రారంభమై మంగళవారంతో ఆర్య మూవీ ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. అందుకుగాను హైదరాబాద్‌లో `20ఏళ్ల ఆర్య` పేరుతో పెద్ద సెలబ్రేషన్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఎమోషనల్‌ అయ్యారు. అప్పటి ఫన్నీ విషయాలను చెప్పుకుని నవ్వుకున్నారు.

ఈ క్రమంలో సుకుమార్‌ మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. `ఆర్య` జ్ఞాపకాలను పంచుకున్నారు సుకుమార్. ఇందులో ఐటెమ్‌ సాంగ్‌ గురించి చెప్పుకొచ్చారు.

ముందు ఐటెమ్‌ సాంగ్‌ లేదట.  కానీ దిల్‌ రాజు కారణంగా ఐటెమ్ సాంగ్‌ పెట్టారట. `అ అంటే అమలాపురం` అలా వచ్చిందే అని చెప్పారు.

ఇక సుకుమార్‌ మరో ఆసక్తికర సంఘటన పంచుకున్నారు. సినిమా రిలీజ్‌కి ఇంకా మూడు రోజులే ఉంది. డబ్బింగ్‌, మిక్సింగ్‌ జరుగుతున్నాయి. ఫైనల్‌ కరెక్షన్స్ లో ఉన్నారు.

ఆ సమయంలో బన్నీని పిలిచి మాంటేజ్‌ సాంగ్‌ తీశారట. ఒక్క నిమిషం సీన్‌ కోసం రెయిన్‌లో ఆ షూట్‌ చేశారట. అయితే సినిమా అప్పటికే అయిపోయింది.

మళ్లీ షూటింగ్‌ ఏంటి అనేది దిల్‌ రాజుకి పెద్ద ప్రశ్న. తాను మొదట ఒప్పుకోలేదట. దీంతో మాట మాట పెరిగి ఇద్దరికి పెద్ద గొడవ అయ్యిందట. నువ్వేంటి అనే మాట కూడా వాడాడట సుకుమార్‌.

చివరికి ఏం చేయలేక దిల్‌ రాజు కాళ్ల మీద పడ్డాడట సుకుమార్‌. చివరికి ఆయన విని ఓకే చెప్పారని తెలిపారు సుకుమార్‌. అలా మూడు రోజుల ముందు మాంటేజ్‌ సాంగ్‌తీసి పెట్టినట్టు తెలిపారు సుకుమార్‌.