‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రివ్యూ

నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు. దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి సంగీతం : కీరవాణి సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్ ఎడిటర్ : రామకృష్ణ విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఇది ఎన్టీఆర్ బయోపిక్‌లో సెకండ్ పార్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రను పోషిస్తూ, నిర్మిస్తున్న […]

'ఎన్టీఆర్ మహానాయకుడు' రివ్యూ
Follow us

|

Updated on: Feb 22, 2019 | 12:49 PM

నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు.

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి

సంగీతం : కీరవాణి

సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్

ఎడిటర్ : రామకృష్ణ

విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు. ఇది ఎన్టీఆర్ బయోపిక్‌లో సెకండ్ పార్ట్ గా వస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రను పోషిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజే రిలీజైయ్యింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఒకసారి రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

మొదట ఎంట్రీ టైటిల్స్ పడుతుండగా..ఎన్టీఆర్ జీవితాన్ని గుర్తు చేస్తూ తారకరాముడు పుట్టినప్పటినుంచి, సినిమాల్లోకి వచ్చినప్పటి సీన్స్, రాజకీయ ప్రకటన చేసేవరకు రివైండ్ చేస్తారు. ఆ తర్వాత ఎన్టీఆర్ (బాలకృష్ణ ) తెలుగు దేశం పార్టీ పెట్టి..9 నెలల కాలంలోనే తన ఇమేజ్ కారణంగా అఖండ విజయం సాధిస్తారు. ప్రజలకు తను ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని ఎన్నో మంచి పనులు చేస్తారు. మరోవైపు ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ అనారోగ్యం ఆయన్ను భాదపెడుతూ ఉంటుంది. ఇదే క్రమంలో ఆయన భార్య ఆరోగ్య పరిస్థితుల రిత్యా అమెరికాకు వెళ్తారు. ఇదే టైం కోసం వెయిట్ చేస్తున్న కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల ఆలోచనల కారణంగా.. ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపేస్తారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తిరిగి ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యారు ? ఆ క్రమంలో ఆయన ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నారు ? ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవ్వడానికి చంద్రబాబు పాత్ర ఎంత వుంది ? చంద్రబాబు పార్టీని నిలబెట్టడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు..? అలాగే భార్య బసవతారకంగారి పాత్ర ఎంత వుంది ? చివరకి ఎన్టీఆర్  నేషనల్ వైజ్ గా గ్రేట్ పొలిటీషియన్ గా ఎలా నిలబడగలిగారు ? లాంటి విషయాలు తెలియాలంటే  థియేటర్‌కు వెళ్లాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

నో డౌట్…ఈ సినిమాకు ప్రధాన బలం బాలయ్యే. ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్ ఏజ్డ్ పాత్రలో కొన్ని సీన్లలో సింక్ అవ్వని బాలయ్య. సెకండ్ పార్ట్ లో ఎన్టీఆర్ పాత్రకు ఆయన తప్ప రిప్లేస్‌మెంట్ ఊహించుకోవడం కష్టమే. మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ లోని ప్రధానమైన కొన్ని హావభావాలను, బాలయ్య తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ప్రేక్షకులను అబ్బుర పరుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక వచ్చే అసెంబ్లీ సన్నివేశాల్లో గానీ, అలాగే బసవతారకంగారి ఆరోగ్యం విషయంలో ఎన్టీఆర్ కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో గానీ బాలయ్య నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకం పాత్రను పోషించిన విద్యాబాలన్ ఫస్ట్ పార్ట్ లో లానే అద్భుతంగా నటించి మెప్పించింది. ముఖ్యంగా బాలయ్య – విద్యాబాలన్ ల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. అయితే వారిద్దరి మధ్య కొన్ని సీన్స్ రీపీటెడ్‌గా అనిపిస్తాయి. చంద్రబాబు పాత్రలో కనిపించిన రానా, హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్, ఏఎన్నార్ పాత్రలో నటించిన సుమంత్ అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకుంటారు. ఇక నాదేండ్ల భాస్కరరావు పాత్రలో నటించిన సచిన్ కేల్కర్ జీవించేశాడు అంతే. క్రిష్ క్యారక్టరైజేషన్స్ తో కథను అధ్భుతంగా నడిపించాడు. ఎక్కడా లాగ్ చెయ్యకుండా తన పని తాను చేసుకుపోయాడు. స్వతహాగా ఆవేశపరుడైన ఎన్టీఆర్‌ని రెచ్చగొట్టి లబ్ధి పొందేందకు అసెంబ్లీలో అపోజిషన్ పన్నిన వ్యూహాలు వంటి వాటిని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాాప్ రేసీగా నడిచిన మహానాయకుడు సెకండ్ హాఫ్‌లో కాస్త నెమ్మదిస్తుంది. దాంతో పాటు మధ్యలో కొంతసేపు ఇది చంద్రబాబు బయోపిక్ నా అన్న అనుమానుం కలుగుతుంది. బాబు సీన్స్‌ను పదే, పదే హైలెట్ చేస్తూ ఆయన వల్లే పార్టీ నిలబడింది, ముందుకు సాగింది అని చెప్పే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ కూడా ఎక్కడో అర్ధాంతరంగా ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. బయోపిక్ కాబట్టి ఎలాంటి రెగ్యూలర్ కమర్షియల్ అంశాలు ఎక్స్ పెక్ట్ చెయ్యకూడదు. మరీ కమర్షియల్ అంశాలు మరియు ఓవర్ గా సినిమాటిక్ శైలిని ఎక్స్ పెక్ట్ చేసి వెళ్లితే మాత్రం కొంతవరకు నిరాశ తప్పదు.

సాంకేతిక వర్గం:

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. క్రిష్ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. ఫస్ట్ పార్ట్ తో పోల్చుకుంటే సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.  బలమైన ఎమోషనల్ సన్నివేశాలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. అలాగే సాయిమాధవ్ బుర్రా తన కలం సత్తా మరోసారి చూపించారు. సంగీత దర్శకుడు కీరవాణి తన పాటలతోనే కాకుండా, నేపథ్య సంగీతంతో కూడా ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుడి గుండె చేరువ చేసే ప్రయత్నం చేశారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఆయన కథకి అనుగుణంగా సినిమాలోని సన్నివేశాలని, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రీకరించారు. అలాగే ఎడిటింగ్ వర్క్ బాగుంది. కొన్ని చోట్ల కత్తెరకు ఇంకొంచం పని చెబితే బాగుండేది. నిర్మాణ సంస్థలు ఎన్ బి కె ఫిలిమ్స్ . వారాహి , విబ్రి మీడియా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఫైనల్ థాట్ :

తెలుగు తెరపై, రాజకీయ యవనికపై  తిగిగులేని రాజుగా ఎదిగిన ఎన్టీవోడి జీవిత చరిత్ర ఈ తరానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మొత్తంగా ఎన్టీఆర్ మహానాయకుడు మెజారిటి ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో