రాజ్‌భవన్ ఉద్యోగుల్లో ఆరుగురికి పాజిటివ్…గవర్నర్‌కు కూడా కరోనా టెస్ట్..?

సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రముఖుల వరకు.. ఇలా ఎవ్వరినీ కోవిడ్ భూతం విడిచిపెట్టడం లేదు. తాజాగా అక్కడ రాజ్‌భవన్ ఉద్యోగుల్లో ఏకంగా ఆరుగురికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణకావటం కలకలం రేపుతోంది.

రాజ్‌భవన్ ఉద్యోగుల్లో ఆరుగురికి పాజిటివ్...గవర్నర్‌కు కూడా కరోనా టెస్ట్..?
Follow us

|

Updated on: May 28, 2020 | 12:41 PM

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, ప్రముఖుల వరకు.. ఇలా ఎవ్వరినీ కోవిడ్ భూతం విడిచిపెట్టడం లేదు. తాజాగా అక్కడ రాజ్‌భవన్ ఉద్యోగుల్లో ఏకంగా ఆరుగురికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణకావటం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్‌కు కరోనా సెగ తగిలింది. రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఆరుగురు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది.

భోపాల్ నగరంలోని మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న సిబ్బంది ఆరుగురికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. రాజ్‌భవన్‌లో వాహనాలు శుభ్రం చేసే క్లీనర్ కుమారుడికి రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. రాజ్‌భవన్‌ క్వార్టర్స్ లోనే నివాసముంటున్న వారి ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులను పరీక్షించగా వారందరికీ కోవిడ్ పాజిటివ్‌గా రిపోర్ట్‌లో వచ్చింది. వారితో పాటు రాజ్‌భవన్ మరో ఉద్యోగికి కూడా కరోనా ఉందని వెల్లడైంది. దీంతో ఆరుగురిని ఆసుపత్రిలోని క్వారంటైన్ కు తరలించారు.

రాజ్‌భవన్ లో కరోనా కేసులు వెలుగుచూడటంతో ముందుజాగ్రత్తగా మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నరుకు కూడా కరోనా పరీక్షలు చేశారు. గవర్నరుకు కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో వచ్చిందని గవర్నర్ ప్రెస్ ఆఫీసర్ అజయ్ వర్మ స్పష్టం చేశారు. భోపాల్ రాజ్‌భవన్ క్వార్టర్స్ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఉద్యోగులందరినీ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.. రాజ్‌భవన్ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేయించారు.

Latest Articles