Gold Price Today: కొత్త సంవత్సరంలో షాకిచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Gold Price Today: కొత్త సంవత్సరంలో బంగారం ధరలు షాకిచ్చాయి. మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న పసిడి ధరలు పరుగులు..

Gold Price Today: కొత్త సంవత్సరంలో షాకిచ్చిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు..!

Updated on: Jan 01, 2022 | 6:34 AM

Gold Price Today: కొత్త సంవత్సరంలో బంగారం ధరలు షాకిచ్చాయి. మళ్లీ బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం లేదు. బంగారం ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రతి రోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. తాజాగా శనివారం (జనవరి 1)న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,520గా ఉంది.

►దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,200గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,200 వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరలు పెరుగుదలకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Petrol Diesel Price: 2021లో మంట పుట్టించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరి న్యూ ఇయర్‌లో ఎలా ఉండబోతున్నాయి..!

WhatsApp Pay: వాట్సాప్‌లో బ్యాంకు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!