కోర్టులోనే ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మృతి

ఈజిప్టు దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ హఠాన్మరణం చెందారు. కోర్టులో విచారణ సందర్భంగా సృహ తప్పి పడిపోయిన ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ వార్తను ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ధ్రువీకరించింది. అయితే 2012లో ముర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈజిప్ట్ అధ్యక్షుడు అవ్వగా.. ఒక్క సంవత్సరంలోనే ఈ దేశ సైన్యం అతడిని దించేసి.. ముర్సీ రక్షణమంత్రి అల్ సిసిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. గూఢచార్యం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న ఆయన.. […]

కోర్టులోనే ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 10:43 AM

ఈజిప్టు దేశ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ హఠాన్మరణం చెందారు. కోర్టులో విచారణ సందర్భంగా సృహ తప్పి పడిపోయిన ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఈ వార్తను ఆ దేశ అధికారిక వార్తా సంస్థ ధ్రువీకరించింది.

అయితే 2012లో ముర్సీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈజిప్ట్ అధ్యక్షుడు అవ్వగా.. ఒక్క సంవత్సరంలోనే ఈ దేశ సైన్యం అతడిని దించేసి.. ముర్సీ రక్షణమంత్రి అల్ సిసిని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టింది. గూఢచార్యం కేసులో అభియోగాలు ఎదుర్కొన్న ఆయన.. సోమవారం జడ్జి ముందు హాజరై, 20 నిమిషాల పాటు మాట్లాడి ఉద్రేకానికి గురై మూర్ఛపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. కాసేపటికే తుది శ్వాస విడిచారు.