Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

మోదీ-జిన్ పింగ్ లైవ్ అప్ డేట్స్.. అసలు విషయం మాత్రం పక్కన పెట్టేశారు !

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ రెండో రోజయిన శనివారం మళ్ళీ భేటీ అయ్యారు. కోవళంలోని తాజ్ ఫిషర్మెన్స్ కోవ్ హోటల్లో ఇద్దరూ ముఖాముఖి సమావేశమయ్యారు. అయితే అసలైన కశ్మీర్ సమస్య మాత్రం వీరి సమావేశంలో ప్రస్తావనకు రాలేదు. తాము నిన్నదాదాపు రెండున్నర గంటల పాటు ఓపెన్ గా, సౌహార్ద పూరితంగా చర్చలు జరిపినట్టు జీ జిన్ పింగ్ తెలిపారు. తమ మధ్య ముఖ్యంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల అంశం చర్చకు వచ్చిందన్నారు. తాము గాఢ స్నేహితుల్లా, హృదయపూర్వకంగా చర్చలు జరిపామని, ఈ చర్చలు రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు అటు-. 2017 లో ఊహాన్ లో తమ మధ్య జరిగిన భేటీ తమకు స్ఫూర్తినిచ్చిందని, భారత-చైనా మధ్య ‘ కసెక్షన్ ; కు చెన్నై వారధిగా ఉపయోగపడిందని మోదీ పేర్కొన్నారు. కాగా- ఈ ఉదయం ఉభయ నేతలూ మొదట ఈ హోటల్లో చేనేత వస్త్రాలపై నిర్వహించిన ప్రదర్శనను తిలకించారు. ఈ ఎగ్జిబిషన్లో… భారతీయతను ప్రతిబింబించే కళాత్మక దేవతా విగ్రహాలను కూడా ఉంచారు. ఈ రోజు మోదీ నిన్నటిలా కాక, కుర్తా, పైజామా ధరించడం విశేషం. ఉభయ దేశాల నాయకులు సమావేశమయ్యే స్థలి వద్ద ఏర్పాటు చేసిన విష్ణు మూర్తి కాంశ్య విగ్రహం చూపరులను ఆకర్షిస్తోంది. ఇలా ఉండగా.. కోవళంలో స్థానికులు, జానపద కళాకారులు తమ నృత్యాలు, ఆట పాటలతో అలరించారు.