Lucifer Movie Update: మెగాస్టార్ ‘లూసిఫర్’ సినిమా నుంచి మరో గాసిప్…హీరోయిన్ పాత్రపై స్పష్టత వచ్చేనా ?

రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరుమీద ఉన్నాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'ఆచార్య'.

Lucifer Movie Update: మెగాస్టార్ 'లూసిఫర్' సినిమా నుంచి మరో గాసిప్...హీరోయిన్ పాత్రపై స్పష్టత వచ్చేనా ?
Follow us

|

Updated on: Feb 01, 2021 | 3:59 PM

Chiranjeevi Lucifer Movie: రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరుమీద ఉన్నాడు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ఆచార్య’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి మరో గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్ సినిమాను తెలుగులో చిరు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్‏గా ఎవరు నటిస్తారనే విషయం తెలియాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర తక్కువ సమయం ఉంటుందంట. ఇక ఇందులో హీరోయిన్‏తో ఒక సాంగ్ మాత్రమే ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకోసం నయనతారను సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో డైరెక్టర్ మోహన్ రాజా బిజీగా ఉన్నారట. ఇందులోని డైలాగ్స్ రచయిత ఆకుల శివత రాయిస్తున్నాడని.. అలాగే మరో రచయిత సాయి మాధవ్ బుర్రా కూడా ఈ మూవీ స్క్రిప్ట్ కోసం పనిచేస్తున్నట్లుగా టాక్. ఈ సినిమాతో మోహన్ రాజా మరో హిట్‏ను సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడట.

Also Read:

Ram Gopal Varma : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బయోపిక్ నుంచి మరో పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ…