ఈ ఇద్దరి రీ ఎంట్రీలో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే!

మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లడంతో.. సినీ ప్రపంచానికి చాలా ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్తేజం రేకెత్తించారు. అయితే అనుకోకుండానే.. వీరిద్దరి రీఎంట్రీల్లో కొన్ని యాధృచ్ఛిక పరిణామాలు సంభవించాయి. వీరి రీఎంట్రీలో కొన్ని కామన్ పాయింట్స్ ఒకటేగా ఉంది. అవేంటో తెలుసుకుందామా..! అయితే వీరిద్దరి రీఎంట్రీలో సిమిలారిటీస్ ఏంటంటే.. ‘శంకర్ దాదా’ […]

ఈ ఇద్దరి రీ ఎంట్రీలో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే!
Follow us

| Edited By:

Updated on: Jan 21, 2020 | 5:07 PM

మెగాస్టార్ చిరంజీవి, లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లడంతో.. సినీ ప్రపంచానికి చాలా ఏళ్లు దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్తేజం రేకెత్తించారు. అయితే అనుకోకుండానే.. వీరిద్దరి రీఎంట్రీల్లో కొన్ని యాధృచ్ఛిక పరిణామాలు సంభవించాయి. వీరి రీఎంట్రీలో కొన్ని కామన్ పాయింట్స్ ఒకటేగా ఉంది. అవేంటో తెలుసుకుందామా..!

అయితే వీరిద్దరి రీఎంట్రీలో సిమిలారిటీస్ ఏంటంటే.. ‘శంకర్ దాదా’ సినిమాతో సినీ కెరీర్‌కి విరామం ప్రకటించిన చిరంజీవి.. పదేళ్ల తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో చిరు రెండు పాత్రల్లో నటించారు. ఒకటి కత్తి సీను, రెండోది ప్రొఫెసర్ జియోలజిస్ట్ శంకర్ పాత్రలో నటించారు. అలాగే విజయశాంతి కూడా దాదాపు 13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఫ్రొఫెసర్ భారతి పాత్రలో ఎంతో గంభీరంగా నటించి మెప్పించారు విజయశాంతి.

అలాగే. ఇద్దరూ ఒకే తేదీ రోజున రీఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11వ తేదీ 2017లో రిలీజ్ కాగా.. ‘సరిలేరు నీకెవ్వరు ‘కూడా జనవరి 11, 2020లో రిలీజ్ అయ్యింది. అంతేగాక.. ఈ రెండు సినిమాలు మెసేజ్ ఓరియెంటెడ్‌వే. అలాగే.. చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 సినిమా’కి పనిచేసిన ‘సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌’లు విజయశాంతి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీకి కూడా పనిచేశారు.