చిరుపై బయోపిక్ తీసే అవసరంలేదంటున్న నాగబాబు

అలనాటి నటి సావిత్రిపై వచ్చిన బయోపిక్ ‘మహానటి’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో చిత్ర పరిశ్రమలోని వారందరూ బయోపిక్‌ల బాట పట్టారు. ఆ కోణంలోనే మెగాస్టార్ చిరంజీవిపై కూడా బయోపిక్ వస్తుందని అందరూ ఊహించారు. అయితే.. దీనిపై మోగా బ్రదర్ ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ.. చిరంజీవిపై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదని తెలిపారు. చిత్ర పరిశ్రమకు వచ్చిన మొదటలో చిరంజీవి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా సక్సెస్‌ఫుల్ జీవితాన్నే గడిపాడు అని అన్నారు. […]

చిరుపై బయోపిక్ తీసే అవసరంలేదంటున్న నాగబాబు
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 5:07 PM

అలనాటి నటి సావిత్రిపై వచ్చిన బయోపిక్ ‘మహానటి’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో చిత్ర పరిశ్రమలోని వారందరూ బయోపిక్‌ల బాట పట్టారు. ఆ కోణంలోనే మెగాస్టార్ చిరంజీవిపై కూడా బయోపిక్ వస్తుందని అందరూ ఊహించారు. అయితే.. దీనిపై మోగా బ్రదర్ ప్రముఖ నటుడు నాగబాబు స్పందిస్తూ.. చిరంజీవిపై బయోపిక్ తీయాల్సిన అవసరం లేదని తెలిపారు. చిత్ర పరిశ్రమకు వచ్చిన మొదటలో చిరంజీవి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత అంతా సక్సెస్‌ఫుల్ జీవితాన్నే గడిపాడు అని అన్నారు.

సావిత్రి, సిల్క్‌స్మిత, సంజయ్‌దత్‌, ఎన్టీఆర్ విషయాలు వేరు. వారు వారి జీవితాల్లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. కాబట్టి వాళ్ల జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రేక్షకులు థియేటర్స్‌కు పరుగులు తీశారు. కానీ మోగాస్టార్ చిరంజీవి జీవితం ప్రేక్షకులకు తెరిచిన పుస్తకమే. ఆయన గురించి అభిమానులకు అంతా తెలిసిందే.. కాబట్టి రామ్‌చరణ్ తన తండ్రి బయోపిక్ తీయకపోవడమే ఉత్తమమంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు నాగబాబు.

కాగా.. ప్రస్తుతం మోగాస్టార్ చిరు ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సినిమా యూనిట్ ఇప్పటికే తెలిపారు.