చదువులో టాలెంట్‌ చూపించాల్సిన విద్యార్థులు కాపీకొట్టడంలో చూపించారు.. వీరు ఎవరో కాదు రేపటి డాక్టర్లు.. ఎక్కడో తెలుసా..

కాలేజీ సిబ్బంది కళ్లుగప్పి.. తమతో తెచ్చుకున్న ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఉపయోగించి కాపీయింగ్‌కి తెరలేపారు. లాస్ట్‌ ఇయర్‌ కావడంతో.. ఒకేసారి క్లియర్‌ చేయాలన్న ఉద్దేశంతో చూచిరాతకు పాల్పడ్డారు. కేఎంసీ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు...

చదువులో టాలెంట్‌ చూపించాల్సిన విద్యార్థులు కాపీకొట్టడంలో చూపించారు.. వీరు ఎవరో కాదు రేపటి డాక్టర్లు.. ఎక్కడో తెలుసా..
Follow us

|

Updated on: Dec 08, 2020 | 6:02 AM

చదువులో టాలెంట్‌ చూపించాల్సిన విద్యార్థులు… కాపీకొట్టడంలో చూపించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. ఈ మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడింది ఎవరో కాదు.. ఏకంగా డాక్టర్ అవ్వాల్సిన ఎంబీబీఎస్‌ విద్యార్థులే. వరంగల్ కేఎంసీలో ఈ హైటెక్ మాస్ కాపీయింగ్ గుట్టు రట్టైంది.

కాలేజీ సిబ్బంది కళ్లుగప్పి.. తమతో తెచ్చుకున్న ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు ఉపయోగించి కాపీయింగ్‌కి తెరలేపారు. లాస్ట్‌ ఇయర్‌ కావడంతో.. ఒకేసారి క్లియర్‌ చేయాలన్న ఉద్దేశంతో చూచిరాతకు పాల్పడ్డారు. కేఎంసీ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తోంది హెల్త్‌ యూనివర్సిటి.

ఈ సెంటర్లో పరీక్షకు మొత్తం ఐదుగురు విద్యార్థులు హాజరయ్యారు. అయితే తాము ఎగ్జామ్‌ రాసే రూమ్‌లో ఉన్న సీసీ కెమెరా వైర్లను పక్కా పథకంతో పీకేశారు. దీంతో సీసీ కెమెరాల్లో తమ మాస్‌ కాపీయింగ్‌ టాలెంట్‌ బయటకు రాకుండా చూసుకున్నారు.

ఇంత హైటెక్‌ పద్దతుల్లో ఎగ్జామ్‌లో కాపీయింగ్‌ జరుగుతున్నా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. అసలు సెంటర్లో ఇన్విజిలేటర్‌ అయినా ఉన్నాడా అనేది అంతుబట్టడంలేదు. ఇదంతా కాలేజీ యాజమాన్యానికి తెలిసే జరుగుతోందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

హైటెక్ పద్దతిలో మాస్ కాపీయింగ్ జరుగుతున్నా ప్రిన్సిపల్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎగ్జామ్‌ హాల్‌ సమీపంలోనే ఓ కారులో వైర్లెస్‌ టెక్నాలజీతో కూడాని ఓ సెటప్‌ కూడా పెట్టేశారు. ఇక్కడి నుంచే విద్యార్థులకు సమాధానాలు అందినట్లు తెలుస్తోంది. ఈ మాస్‌ కాపీయింగ్‌ వెనుక పెద్దల హస్తం ఉండే ఉంటుందన్న అనుమానాలున్నాయి.

Latest Articles