కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. రూ.2కోట్ల నష్టం

, కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. రూ.2కోట్ల నష్టం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్లాస్‌హౌస్ సెంటర్‌లోని సూపర్‌మార్కెట్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడు అంతస్తులకు మంటలు వ్యాపించడంతో దాదాపు రూ.2కోట్ల మేర ఆస్తి బుగ్గిపాలైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భవనం ఇరుకు ప్రాంతంలో ఉండటంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *