Breaking News
  • కడప: వివేకా హత్యపై సీబీఐ విచారణ జరపాలి. బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్‌ రాజీనామా చేయాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడుతారు-ఆదినారాయణరెడ్డి.
  • రేపు పవన్‌ కల్యాణ్ ఢిల్లీ పర్యటన. కేంద్రీయ సైనిక్‌ బోర్డు కార్యాలయం సందర్శించనున్న పవన్‌. అమరవీరుల సంక్షేమానికి రూ.కోటి అందించనున్న పవన్‌.
  • కృష్ణాజిల్లా: చందర్లపాడు తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. పక్కా ఇళ్ల స్థలాలకు తన పొలంలో మట్టి తవ్వుతున్నారని మనస్తాపం. పురుగులమందు తాగబోయిన రైతు, అడ్డుకున్న సిబ్బంది.
  • ప.గో: తాడేపల్లిగూడెం శశి ఇంజినీరింగ్‌ కాలేజ్ విద్యార్థి మృతి. బైక్‌పై నుంచి పడి మృతిచెందాడంటున్న తండ్రి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు.
  • హైదరాబాద్: మిస్టరీగా మారిన ఆయుష్‌ చాన్‌ బే మృతి, ఈనెల 16న స్నేహితుడి పుట్టిన రోజు అని వెళ్లిన ఆయుష్‌, నిన్న రక్తపు మడుగులో శవమై తేలిన ఆయుష్‌, ఆయుష్‌పై మృతిపై అనుమానాలు.
  • విజయవాడ: అక్రమ కట్టడాలపై ఏసీబీ అధికారుల దాడులు. అనధికారిక అనుమతులపై లోతైన విచారణ. అక్రమంగా నిర్మించిన భవన యజమానులపై చర్యలకు సిఫారసు.

‘డిస్కోరాజా’కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుంది: రవితేజ

Disco Raja movie Pre Release Event updates, ‘డిస్కోరాజా’కు సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉంటుంది: రవితేజ

అన్ని సవ్యంగా కుదిరితే ‘డిస్కోరాజా’ మూవీకి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ గానీ ఉంటుందని తెలిపారు హీరో రవితేజ. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డిస్కోరాజా’. వీఐ ఆనంద్ దర్శకత్వంగా పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్స్‌గా ఆడిపాడారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియెన్స్‌ను పలుకరించబోతుంది.

ఆదివారం ‘డిస్కోరాజా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంచి జోష్‌తో మాట్లాడారు రవితేజ. తాను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన క్యారక్టరైజేషన్స్ అన్నీ ఈ చిత్రంలో చేశానని పేర్కొన్నారు. షూటింగ్‌ టైంలో ఫుల్‌గా ఎంజాయ్ చేశానని చెప్పిన రవితేజ, అదే ఎంజామ్‌మెంట్ ఫ్యాన్స్‌కు కూడా ఉంటుందని హామి ఇచ్చారు. బాబీ సింహా, రాంకీ లాంటి యాక్టర్స్‌తో తొలిసారి కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు. మాములుగా ఎప్పుడూ ఒకరు లేదా ఇద్దరు హీరోయిన్స్‌తో నటించానని, తొలిసారి ‘డిస్కోరాజా’ మూవీ కోసం ముగ్గురు హీరోయిన్స్‌తో కలిసి నటించానన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌తో తాను 11 సినిమాలు చేశానని..తన నెక్ట్స్ మూవీ ‘క్రాక్’ 12 చిత్రం అవుతుందని తెలిపారు.

Related Tags