Man Vs Wild: ఆ వయసులో హిమాలయాలకు వెళ్లా.. అదో గొప్ప అనుభవం

డిస్కవరీ వ్యాఖ్యాత బేర్ గ్రిల్‌తో చేసిన సాహసయాత్ర మేన్ వర్సెస్ వైల్డ్‌లో ప్రధాని మోదీ తనకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇక ఇందులో భాగంగా యువకుడిగా ఉన్నప్పుడు పర్వతాల్లో ఎక్కువగా గడిపేవారట కదా అంటూ గ్రిల్, మోదీని ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ.. అవును. నాకు 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేశాను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని ఆలోచించాను. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం. అందుకు హిమాలయాలకు వెళ్లాను. అక్కడ […]

Man Vs Wild: ఆ వయసులో హిమాలయాలకు వెళ్లా.. అదో గొప్ప అనుభవం
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2019 | 5:42 AM

డిస్కవరీ వ్యాఖ్యాత బేర్ గ్రిల్‌తో చేసిన సాహసయాత్ర మేన్ వర్సెస్ వైల్డ్‌లో ప్రధాని మోదీ తనకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఇక ఇందులో భాగంగా యువకుడిగా ఉన్నప్పుడు పర్వతాల్లో ఎక్కువగా గడిపేవారట కదా అంటూ గ్రిల్, మోదీని ప్రశ్నించారు. దానికి స్పందిస్తూ.. అవును. నాకు 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి వచ్చేశాను. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని ఆలోచించాను. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం. అందుకు హిమాలయాలకు వెళ్లాను. అక్కడ చాలామందిని కలిశాను. వారి మధ్యనే గడిపాను. అదొక విశేషమైన అనుభవం. చాలా సమయం అక్కడ గడిపాను అంటూ మోదీ పేర్కొన్నారు.