మహావీర్ కర్ణన్ ఆలస్యానికి ఆదిత్య వర్మ కారణమా..?

తమిళనాట సీనియర్ స్టార్ హీరోల జాబితాలో విక్రమ్ కనిపిస్తాడు. విభిన్నమైన.. విలక్షణమైన పాత్రలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు విక్రమ్. అలాంటి విక్రమ్ హీరోగా మహావీర్ కర్ణన్ అనే భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాగా ఆ తరువాత ఆ సినిమానికి సంబంధించిన వార్తలు మళ్లీ రాలేదు. దీంతో ప్రాజెక్టు ఆగిపోయిందేమనని అంతా అనుకున్నారు. కానీ, విక్రమ్‌తో మూవీ తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్దంగానే ఉన్నారని, విక్రమ్ దే ఆలస్యమనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. […]

మహావీర్ కర్ణన్ ఆలస్యానికి ఆదిత్య వర్మ కారణమా..?
Follow us

| Edited By:

Updated on: Jun 15, 2019 | 5:20 PM

తమిళనాట సీనియర్ స్టార్ హీరోల జాబితాలో విక్రమ్ కనిపిస్తాడు. విభిన్నమైన.. విలక్షణమైన పాత్రలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు విక్రమ్. అలాంటి విక్రమ్ హీరోగా మహావీర్ కర్ణన్ అనే భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కాగా ఆ తరువాత ఆ సినిమానికి సంబంధించిన వార్తలు మళ్లీ రాలేదు. దీంతో ప్రాజెక్టు ఆగిపోయిందేమనని అంతా అనుకున్నారు. కానీ, విక్రమ్‌తో మూవీ తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్దంగానే ఉన్నారని, విక్రమ్ దే ఆలస్యమనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయితే విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఆదిత్య వర్మ సినిమా నిర్మితమవుతోంది. ఇక ధృవ్‌కి ఇది తొలి సినిమా కావడం వలన, అన్ని వ్యవహారాలను విక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఆదిత్య వర్మ విడుదలయ్యేవరకూ వెయిట్ చేయమని మహావీర్ కర్ణన్‌ను ఆయన హోల్డ్ లో పెట్టేశారని చెబుతున్నారు. ఆదిత్య వర్మ విడుదల తరువాతనే ఈ సినిమా సెట్స్ పైకి వెళనుందని టాక్ వినిపిస్తోంది.