‘మా’లో మరో లొల్లి..కార్యాలయానికి తాళాలు..

‘మా’ అసోసియేషన్‌లో విభేదాలు సమసిపోవడం లేదు. ‘మా’ క్యాలెండర్ ఆవిష్కరణ ఈవెంట్‌లో రాజశేఖర్, చిరు ఇన్సిడెంట్ ఎంత కాక రేపిందో అందరికి తెలిసిందే. మీడియా ముందే విమర్శలు, ప్రతి విమర్శలతో తీవ్ర గందరగోళం క్రియేట్ అయింది. వెంటనే రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మెగాస్టార్ డిమాండ్ చేశారు. అయితే రాజశేఖర్ స్వతహాగా రాజీనామా చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది అని అందరూ భావించారు. వెంటనే ఓ క్రమశిక్షణా కమిటీని కూడా ఏర్పాటు చేసింది బోర్డు. అయినా కానీ అధ్యక్షుడు నరేశ్, […]

'మా'లో మరో లొల్లి..కార్యాలయానికి తాళాలు..
Follow us

|

Updated on: Jan 21, 2020 | 6:03 PM

‘మా’ అసోసియేషన్‌లో విభేదాలు సమసిపోవడం లేదు. ‘మా’ క్యాలెండర్ ఆవిష్కరణ ఈవెంట్‌లో రాజశేఖర్, చిరు ఇన్సిడెంట్ ఎంత కాక రేపిందో అందరికి తెలిసిందే. మీడియా ముందే విమర్శలు, ప్రతి విమర్శలతో తీవ్ర గందరగోళం క్రియేట్ అయింది. వెంటనే రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలంటూ మెగాస్టార్ డిమాండ్ చేశారు. అయితే రాజశేఖర్ స్వతహాగా రాజీనామా చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది అని అందరూ భావించారు. వెంటనే ఓ క్రమశిక్షణా కమిటీని కూడా ఏర్పాటు చేసింది బోర్డు. అయినా కానీ అధ్యక్షుడు నరేశ్, జనరల్ సెక్రటరీ జీవిత మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరిది డెడ్లీ కాంబినేషన్ అని,  ‘మా’ ని మరింత ముందుగా తీసుకెళ్లాలని మెగాస్టార్..నరేశ్, జీవితలను బాహాటంగా ప్రశంసించారు. అన్నీ మర్చిపోయి ‘మా’ ఉన్నతికి కృషి చేయాలని పెద్దలు, కళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి కూడా కోరారు. ఈ పరిస్థితుల్లో కూడా ‘మా’ పెద్దలు విభేదాలు వీడటం లేదు.

తాజాగా ‘మా’ కార్యాలయం రెండు రోజులుగా బోసిపోయి కనిపిస్తోంది. ఆఫీసు డోర్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. స్టాఫ్ కూడా ఎవరూ రావడం లేదు. ఈ విషయంపై వివరణ తీసుకునేందుకు ప్రయత్నించింది టీవీ9. తాను షూటింగ్‌లో ఉన్నానని జీవిత ఆఫీసు వ్యవహారాలు చూసుకుంటున్నారని నరేశ్ తెల్పగా, మా స్టాఫ్‌కు హెల్త్ బాలేదని అందుకే కార్యాలయం తెరవడం లేదని జీవిత చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై వీడియో బైట్‌లు ఇచ్చేందుకు మాత్రం ఇరువురు తిరస్కరించారు. నిధులు కేటాయింపు విషయంలో మరోసారి ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో